కొవిడ్ రోగి మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలించేందుకూ నిర్లక్ష్యం వహించింది ఓ ఆసుపత్రి యాజమాన్యం. ఈ ఘటన మధ్యప్రదేశ్ గ్వాలియర్లో జరిగింది.
ఇదీ జరిగింది..
మురార్లోని జిల్లా ఆసుపత్రిలో ఓ కొవిడ్ రోగి మృతిచెందాడు. అయితే.. ఆ మృతదేహాన్ని మొత్తం సీల్ చేసి ఆసుపత్రిలోనే 24 గంటల పాటు ఉంచారు సిబ్బంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీశ్ సికార్వర్ చొరవతో ఆ మృతదేహాన్ని అంత్యక్రియలకు తీసుకెళ్లిన్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై స్పందించిన ఆసుపత్రి యాజమాన్యం.. తమ వద్ద ఎక్కువ మంది సిబ్బంది లేకపోవడం వల్లే మృతదేహాన్ని తీసేందుకు ఆలస్యమైందని చెప్పుకొచ్చింది.
ఇదీ చదవండి:రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్కు కరోనా