Covaxin Intranasal Vaccine: భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అభివృద్ధి చేసిన చుక్కల మందు టీకా (నాసల్ వ్యాక్సిన్) ముడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు డీసీజీఐ అనుమతులు ఇచ్చింది. దీంతో బూస్టర్ డోసు'గా దీన్ని వినియోగించేందుకు అవసరమైన పరీక్షల నిర్వహణకు మార్గం సుగమమైంది. ఈ టీకా మూడో దశ క్లినికల్ పరీక్షలు దేశవ్యాప్తంగా 9 ప్రాంతాల్లో జరగనున్నాయి.
'ఒమిక్రాన్' కేసులు విస్తరిస్తున్న నేపథ్యంలో 'బూస్టర్ డోసు'పై ఎక్కువ మంది దృష్టి సారిస్తున్నారు. అందువల్ల చుక్కల మందు టీకాను బూస్టర్ డోసుగా ఇచ్చేందుకు అనువైన క్లినికల్ పరీక్షలను నిర్వహిస్తామని, అందుకు అనుమతి ఇవ్వాలని భారత్ బయోటెక్ ఇటీవల డీసీజీఐకి దరఖాస్తు చేసింది. దాదాపు 5,000 మంది వలంటీర్లపై ఈ పరీక్షలను నిర్వహించాలని యోచిస్తున్నట్లు సమాచారం.
ఇందులో సగం మందిని కొవాగ్జిన్, మిగిలిన సగం మందిని కొవిషీల్డ్ టీకా తీసుకున్న వారి నుంచి ఎంచుకుంటారని తెలుస్తోంది. సాధారణంగా రెండో డోసు తీసుకున్న తర్వాత 6 నుంచి 9 నెలల వ్యవధిలో బూస్టర్ డోసు తీసుకుంటే అధిక ప్రయోజనం ఉంటుందని అంటున్నారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం! '