ETV Bharat / bharat

కన్నతండ్రిని కడతేర్చిన కూతురు.. బలవంతం చేశాడని.. - కూతురిపై అత్యాచారనికి తెగబడ్డ తండ్రి

కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కూతురిపై కన్నేశాడు. మానవత్వానికే మచ్చతెచ్చే ఈ ఘటన తమిళనాడులో వెలుగుచూసింది. ఈ అఘాయిత్యాన్ని భరించలేని ఆ కూతురు తండ్రిని కడతేర్చింది.

rape
rape
author img

By

Published : Sep 25, 2021, 4:59 PM IST

Updated : Sep 25, 2021, 6:52 PM IST

కన్నతండ్రే కూతురి పట్ల కిరాతకుడిగా మారాడు. కూతురని కూడా చూడకుండా తన వాంఛ తీర్చాలని విచక్షణ కోల్పోయి అఘాయిత్యానికి ఒడిగట్టేందుకు ప్రయత్నించిన ఆ తండ్రిని కూతురు హతమార్చిన ఘటన తమిళనాడులో జరిగింది.

అసలేం జరిగిందంటే..?

విల్లుపురం జిల్లా కోవిల్‌పురాయూర్ గ్రామానికి చెందిన వెంకటేశ్ దివ్యాంగుడు. తన భార్య మరణం తరువాత ఇద్దరు కూతుళ్లతో కలసి నివసిస్తున్నాడు. వెంకటేశ్​ పెద్ద కుమార్తె చెన్నైలోని ఓ షాపింగ్ మాల్​లో పనిచేస్తుండగా.. చిన్న కుమార్తె ఇంటివద్దే ఉంటూ పదకొండో తరగతి చదువుతోంది.

నామినేషన్ వేసి వచ్చి విగతజీవిగా..

ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ దాఖలు కోసం వెళ్లి వచ్చిన వెంకటేశ్ తన ఇంట్లో విగతజీవిగా పడి ఉన్నాడు. బంధువులు, స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహంపై కత్తి పోట్లను బట్టి.. తొలుత రాజకీయ హత్యగా భావించి విచారణ చేపట్టారు. అయితే తమ దర్యాప్తులో వెంకటేశ్ రెండో కుమార్తె తండ్రిని హత్య చేసిందని గుర్తించారు. 'నా తండ్రి లైంగికంగా నన్ను వేధించాడు.. ఆత్మరక్షణ కోసమే చంపేశానని' ఆమె తెలిపిందని డీఎస్పీ ఇళంగోవన్ తెలిపారు. ఆమె మాటలతో పోలీసులు విస్తుపోయారు. అరెస్టు చేసి వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు.

బాలిక అరెస్టు విషయం తెలుసుకున్న విల్లుపురం జిల్లా ఎస్పీ శ్రీనాథ.. ఆత్మరక్షణ కోసం తండ్రిని చంపిన బాలికను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.

భార్య, కుమార్తెను చంపి తానూ ఉరి..

భార్యతో పాటు రెండేళ్ల కుమార్తెను చంపి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో జరిగింది. పర్లీ తాలూకా సిరసాలలో శుక్రవారం జరిగిన ఈ ఘటనలో అల్లాబక్ష్ అహ్మద్ షేక్ ఈ ఘోరానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

వెల్డర్‌గా పనిచేస్తున్న అల్లాబక్ష్ కుటుంబం ఓ వివాహ వేడుకకు హాజరు కావాల్సి ఉంది. ఎంతకూ రాకపోవడంతో అనుమానం వచ్చిన బంధువులు ఇంటికి వచ్చి చూడగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కుటుంబ కలహాల వల్లే ఈ మరణాలు జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

క్షణికావేశంలో..

ఇంట్లో జరిగిన ఓ గొడవ కారణంగా.. భార్యకు నిప్పంటించి భర్త కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని లఖింపూర్ జరిగింది. ఈ వ్యవహారాన్ని గుర్తించిన స్థానికులు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

గ్రామానికి చెందిన అజయ్ భార్య రోమాదేవి కొన్ని నెలలుగా తల్లిగారింటి వద్ద ఉంటోంది. అత్తమామలతో కలసి ఉండేందుకు నిరాకరిస్తున్న కారణంగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. గతరాత్రి సైతం ఈ విషయంపై గొడవ జరిగిందని.. క్షణికావేశంలో తన భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించి.. తానూ కాల్చుకున్నాడని వివరించారు.

ఇవీ చదవండి:

Last Updated : Sep 25, 2021, 6:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.