ETV Bharat / bharat

పర్యటక ప్రదేశంగా దశరథ మహారాజు సమాధి- అయోధ్యకు ఎంత దూరమో తెలుసా? - అయోధ్య రామాలయం ఓపెనింగ్

Dashrath Samadhi Ayodhya : అయోధ్యలో శ్రీరాముడి మందిరమే కాకుండా ఇతర పర్యటక స్థలాలనూ ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఇందులో రామాయణంలోని ప్రధాన పాత్రల్లో ఒకటైన శ్రీరాముడి తండ్రి దశరథ మహారాజు సమాధి స్థలం కూడా ఉంది. ఆ సమాధి ప్రస్తుతం ఎలా ఉంది, కొత్తగా నిర్మితమవుతున్న ఆలయానికి ఎంత దూరంలో ఉందన్న విషయాలను ఈ కథనంలో చూద్దాం.

dashrath samadhi ayodhya
dashrath samadhi ayodhya
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 4, 2024, 6:44 PM IST

పర్యటక ప్రదేశంగా దశరథ మహారాజు సమాధి

Dashrath Samadhi Ayodhya : మనలో చాలా మందికి శ్రీరాముడి తండ్రి దశరథ మహారాజు గురించి తెలుసు. దశరథుడు మరణించిన తర్వాత ఆయనకు అయోధ్యలోనే దహన సంస్కారాలు నిర్వహించి సమాధి నిర్మించినట్లు తెలుస్తోంది. రామాలయం ప్రారంభం తర్వాత భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం అయోధ్యలో ప్రాశస్త్యం ఉన్న ఇతర ప్రాంతాలనూ అభివృద్ధి చేస్తోంది. అందులో ఈ దశరథ్‌ సమాధి స్థల్‌ కూడా ఉంది. ఈ ప్రాంతం రామమందిరానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది.

dashrath samadhi ayodhya
బిల్వహరి ఘాట్​లో రామలక్ష్మణులు పాదముద్రలు

దశరథుని దహన సంస్కారాలను రాజ్యంలో అంతకుముందు ఏ అంత్యక్రియలు జరగని ప్రదేశంలో నిర్వహించాలని భరతుడు అనుకున్నాడని ఇక్కడి పూజారి మహంత్‌ దిలీప్‌ దాస్‌ తెలిపారు. మంత్రులు, ప్రజలను అలాంటి స్థలాన్ని వెతకమని భరతుడు సూచించాడని, చివరకు ఈ ప్రదేశాన్ని కనుగొన్నారని వివరించారు. సరయు నదీ తీరాన ఉన్న ఈ ప్రాంతాన్ని బిల్వహరి ఘాట్‌ అంటారని దిలీప్‌దాస్‌ చెప్పారు. ఇక్కడ దశరథుడిని దహనం చేసి ఆ చితాభస్మాన్ని సమాధిలో భద్రపరచారని వెల్లడించారు.

dashrath samadhi ayodhya
బిల్వహరి ఘాట్‌

ప్రస్తుతం రామమందిరం నుంచి బిల్వహరి ఘాట్‌కు చేరుకునేందుకు నాలుగు వరుసల రహదారిని ప్రభుత్వం నిర్మిస్తోంది. అలాగే పార్కింగ్ కోసం కూడా స్థలాన్ని కేటాయించారు.

"దశరథ్ సమాధి స్థల్ రోడ్డు ప్రాజెక్టును ఉత్తరప్రదేశ్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ అభివృద్ధి చేస్తోంది. దీనిని ఏ-బీ బంధా రోడ్ అని పిలుస్తాం. నాలుగు వరుసల రహదారి ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఇది దశరథ్ సమాధి మీదుగా వెళ్లి సుల్తాన్‌పుర్ ప్రయాగ్‌రాజ్ హైవేకు కలుస్తుంది. అయోధ్య వారసత్వాన్ని నిలుపుకునేలా దీన్ని అభివృద్ధి చేస్తున్నాం."
--విశాల్‌ సింగ్‌, అయోధ్య అభివృద్ధి అథారిటీ వైస్‌ ఛైర్మన్‌

ఇక్కడ దశరథుని సమాధితో పాటు రామ, లక్ష్మణ, భరత, శతృఘ్ను పాద ముద్రలను తీర్చిదిద్దారు. లంక నుంచి రామలక్ష్మణులు తిరిగి వచ్చాక దశరథునికి సమాధికి వచ్చి ఆశీస్సులను తీసుకున్నట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది.

ప్రారంభోత్సవ కార్యక్రమ వివరాలు ఇలా!
Ram Mandir Opening Ceremony : మరోవైపు, అయోధ్య రామాలయ గర్భగుడిలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు 2024 జనవరి 16వ తేదీన మొదలు కానున్నాయి. 17వ తేదీన 51 అంగుళాల బాల రాముడి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువస్తారు. జనవరి 20న సరయూ నదీజలాలతో రామ మందిరాన్ని శుద్ధి చేస్తారు. అదే రోజు వాస్తు పూజలు నిర్వహిస్తారు. 21న బాల రాముడి విగ్రహం సంప్రోక్షణ ఉంటుంది. 22న ఉదయం పూజల అనంతరం మృగశిర నక్షత్రంలో మధ్యాహ్న సమయంలో బాల రాముడి విగ్రహాన్ని శాశ్వత ప్రతిష్ఠ చేయనున్నారు.

అయోధ్యకు 1430కి.మీ రన్​- సనాతన ధర్మంపై అవగాహనే లక్ష్యం!

రాముడి జెండాతో బ్యాంకాక్​లో స్కైడైవ్- 13 వేల అడుగుల నుంచి దూకిన యువతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.