ETV Bharat / bharat

'కాలుష్య నష్టం.. తీవ్ర నేరాల కంటే ఎక్కువే'

author img

By

Published : Feb 7, 2021, 6:18 PM IST

నదీ కాలుష్య నివారణకు ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడంపై జాతీయ హరిత ట్రైబ్యునల్​ విచారం వ్యక్తం చేసింది. కాలుష్యంతో కలిగే నష్టం తీవ్రమైన నేరాలకన్నా తక్కువేమి కాదని వ్యాఖ్యానించింది. కాలుష్య నివారణకు వేగవంతమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

Damage from pollution no less than damage from other heinous crimes: NGT
'కాలుష్య నివారణ రహిత ఫలితాలు నేరంకన్నా ఎక్కువే'

హిండన్​ నదిలో కాలుష్యాన్ని తగ్గించేందుకు పటిష్ఠ చర్యలు తీసుకోనందుకు ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వాన్ని జాతీయ హరిత ట్రైబ్యునల్​ తప్పుబట్టింది. కాలుష్యంతో కలిగే నష్టం తీవ్రమైన నేరాల వల్ల కలిగే నష్టానికి తక్కువేమి కాదని వ్యాఖ్యానించింది. కార్యనిర్వాహక విభాగాలు రాజ్యాంగపరమైన బాధ్యతలను నిర్వహించలేనప్పుడు వరుస ఆదేశాలు ఇచ్చినా ప్రయోజనం ఉండదని జస్టిస్​ ఎ.కె.గోయల్​ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. కాళీ, కృష్ణా, హిండన్​ నదుల కాలుష్యం కారణంగా పరిసర ప్రాణులు మరణిస్తున్నాయని ఎన్​జీవో దోబా పర్యావరణ్​ సమితి దాఖలు చేసిన పిటిషన్​పై ఎన్​జీటీ విచారణ జరిపింది.

రాజ్యాంగపరమైన బాధ్యతలను నిర్వర్తించడంలో రాష్ట్ర యంత్రాంగం విఫలమైందని చెప్పడం విచారకరం. సమస్యకు పరిష్కార మార్గాలను వెతకకుండా..కేవలం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడమే అసలు సమస్యకు దారితీస్తుంది. ప్రభుత్వ చీఫ్​ సెక్రటరీ జోక్యంతో వివిధ శాఖల మధ్య సమన్యయంతో కాలుష్య నివారణకు వేగవంతమైన చర్యలు తీసుకోవాలి. అధికారులకు బాధ్యతలను అప్పగించాలి. అందులో విఫలమైన అధికారుల జాబితాను, గతంలో ఈ బాధ్యతలు అప్పగించిన అధికారుల రికార్డులు, కేటాయించిన నిధుల రికార్డులు నమోదు చేయాలి.

-ఎన్​జీటీ

హిండన్​ నది పరిశుభ్రతకు తీసుకుంటున్న ప్రణాళికలను నది పునరుద్ధరణ కమిటీ అధ్యక్షుడు పర్యవేక్షించాలని ఎన్​జీటీ ఆదేశించింది.

ఇదీ చదవండి: ఉత్తరాఖండ్​లో పెను ప్రమాదం- 150 మంది మృతి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.