ETV Bharat / bharat

కరెంట్​ స్తంభానికి షర్ట్​తో ఉరేసి యువకుడు హత్య.. వారి ఆగడాలు బయటపెట్టినందుకే! - dalit youth hanged in pachara

గ్రామంలో దళిత మహిళలపై పెద్దలుగా వ్యవహరించే కొందరు వ్యక్తులు అఘాయత్యాలకు పాల్పడుతున్నారు. అయితే ఇది సహించని ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అది జరిగిన వెంటనే యువకుడు.. గ్రామ శివార్లలోని పొలంలో విగతజీవిగా కనిపించాడు. అతడి షర్ట్​తోనే కరెంట్ స్తంభానికి ఉరేసి చంపారు దుండగులు. ఝార్ఖండ్​లో జరిగిందీ ఘటన.

Dalit youth hanged by dabangs
Dalit youth hanged by dabangs in Hazaribag
author img

By

Published : Oct 12, 2022, 11:17 AM IST

Updated : Oct 12, 2022, 11:28 AM IST

ఝార్ఖండ్​లోని హజారీబాగ్​లో విషాదం నెలకొంది. గ్రామంలో ఆధిపత్యం చెలాయిస్తున్న కొందరు వ్యక్తుల ఆగడాలకు అడ్డు చెప్పాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఓ దళిత యువకుడ్ని అతిదారుణంగా చంపేశారు దుండగులు. అతడి చొక్కాతోనే కరెంట్​ స్తంభానికి ఉరేసి హత్య చేశారు. అయితే తమ కుమారుడ్ని గ్రామ పెద్దలే హత్య చేసి ఉంటారని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

పోలీసుల సమాచారం ప్రకారం.. కేదారీ పోలీస్​స్టేషన్​ పరిధిలోని పచారా గ్రామంలో అక్టోబరు 5న ఓ దళిత మహిళపై ఆ ఊర్లోని పెద్ద మనుషులుగా వ్యవహరించే వ్యక్తులు అఘాయత్యానికి పాల్పడ్డారు. ఈ విషయం అదే గ్రామానికి చెందిన సేతన్​ భూయాన్​ అనే యువకుడికి తెలిసింది. దీంతో ఈ అన్యాయాన్ని సహించక అఘాయిత్యానికి పాల్పడిన కుటుంబసభ్యులను నిలదీద్దామని సేతన్​ వెళ్లాడు. కానీ వారే తిరిగి అతడి కుటుంబంపైన పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. దీంతో సేతన్​ జరిగిన విషయం మొత్తాన్ని పోలీసులకు తెలియజేశాడు.

అది జరిగిన తర్వాత సేతన్​.. గ్రామ శివార్లలోని పొలంలో విగత జీవిగా కనిపించాడు. అతడి షర్ట్​తోనే కరెంట్​ స్తంభానికి ఉరేసి చంపారు దుండగులు. అయితే గ్రామ పెద్దలే తమ కుమారుడ్ని హత్య చేశారని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కొన్నిరోజుల క్రితం తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని సేతన్ కుటుంబసభ్యులు ఫిర్యాదు చేసినప్పటికి పోలీసులు స్పందించలేదని వాపోతున్నారు. అయితే ఈ ఘటనలో 11 మందిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: స్వదేశీ ఆయుధాలపై భారత్ ప్రత్యేక దృష్టి.. ఇక శత్రుదేశాలకు చుక్కలే

పానీపూరిలు లాగించిన ఏనుగు.. ఒకటి కాదు రెండు కాదు.. నాన్​స్టాప్​గా..

Last Updated : Oct 12, 2022, 11:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.