ETV Bharat / bharat

చెట్టుకు వేలాడుతూ దళిత మైనర్ల మృతదేహాలు.. రేప్ చేసి హత్య.. దివ్యాంగురాలిపై దారుణం - మైనర్​పై మేనమామ రెప్​

ఇద్దరు దళిత అక్కాచెల్లెళ్ల మృతదేహాలు.. గ్రామ శివార్లలో ఓ చెట్టుకు వేలాడుతూ అనుమానాస్పద రీతిలో లభ్యమయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని లఖింపుర్​ఖేరిలో జరిగింది. మరోవైపు, మైనర్​పై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ బస్​ డ్రైవర్​ ఇంటిని మధ్యప్రదేశ్ ప్రభుత్వం బుల్డోజర్​తో కూల్చేసింది.

dalit-sisters-found-hanging-from-tree-in-up
UP: Two dalit-sisters-found-hanging-from-tree-in-upgirls found hanging from tree in Lakhimpur Kheri
author img

By

Published : Sep 15, 2022, 9:39 AM IST

Updated : Sep 15, 2022, 10:42 AM IST

Two Dalit Sisters Hanging : ఉత్తర్​ప్రదేశ్​లోని లఖింపుర్​ ఖేరిలో ఇద్దరు దళిత అక్కాచెల్లెళ్ల మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ అనుమానాస్పద రీతిలో లభ్యమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆరుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఘటనపై విచారణ చేపడుతున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. నిఘాసన్​ పోలీస్​ స్టేషన్​ పరిధికి చెందిన ఇద్దరు బాలికలను ఆరుగురు నిందితులు.. గ్రామ శివార్లలోని పొలానికి తీసుకెళ్లారు. అక్కడ ఆరుగురు కలిపి.. వారిద్దరిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం తమను పెళ్లి చేసుకోవాలని బాధితురాళ్లు బలవంతం చేశారు. దీంతో బాలికలను గొంతు కోసి హత్య చేశారు. ఆ తర్వాత అక్కాచెల్లెళ్ల మృతదేహాలను చెట్టుకు వేలాడదీశారు. నిందితులను చోటూ, జునైద్, సోహైల్, హఫీజుల్, కరీముద్దీన్, ఆరిఫ్‌లుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

అనుమానం రాకుండా ఉండేందుకే.. ఇద్దరు అక్కాచెల్లెళ్లను పట్టపగలే కిడ్నాప్​ చేసి ఎత్తుకెళ్లారని వారి తల్లి చెప్పింది. అయితే తమ పిల్లలను నిందితులు.. అత్యాచారం చేసి హత్య చేశారని, అనంతరం అనుమానం రాకుండా ఉండేందుకు చెట్టుకు వేలాడదీశారని ఆరోపించింది. దాంతో పాటు అనుమతి లేకుండా మృతదేహాలకు పోస్టుమార్టం జరిపించారని బాధితురాళ్ల తండ్రి వాపోతున్నారు.

ఉన్నత స్థాయి విచారణకు ఎస్పీ డిమాండ్​..
ఇద్దరు దళిత సోదరీమణుల మృతదేహాలు లభ్యమైన ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ.. యోగి ప్రభుత్వంపై విరుచుకుపడింది. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేసింది.

మైనర్​పై మేనమామ అత్యాచారం..
కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో దారుణం జరిగింది. అందరూ నిద్రిస్తున్న సమయంలో మైనర్​పై పలుమార్లు అత్యాచారం చేశాడు ఆమె మేనమామ. బాలిక అసౌకర్యాన్ని స్థానిక ఆశావర్కర్​ గుర్తించడం వల్ల అతడి దుశ్చర్య వెలుగులోకి వచ్చింది.

పోలీసుల వివరాల ప్రకారం.. జిల్లాలోని కడబ ప్రాంతానికి బాధితురాలు(17).. తొమ్మిదో తరగతితో చదువు ఆపేసి తన మేనమామ రుక్మయ్య(31) ఇంట్లో గత మూడేళ్లగా ఉంటోంది. ఫిబ్రవరి నెలలో అందరూ నిద్రిస్తున్న సమయంలో డ్రాయింగ్​ రూమ్​కు బాలికను తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు. మేనమామ మాటలకు భయపడిన బాధితురాలు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు.

అయితే తాజాగా ఆ ప్రాంతంలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించడానికి ఆశా వర్కర్​ వచ్చారు. బాధితురాలి అసౌకర్యాన్ని గుర్తించి ఆశా వర్కర్​ ఆరా తీయగా.. బాలిక జరిగినదంతా చెప్పింది. వెంటనే ప్రెగ్నెన్సీ టెస్ట్​ చేయగా.. పాజిటివ్​ వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి రుక్మయ్యను అరెస్ట్​ చేశారు.

చిన్నారిపై స్కూల్ బస్​​ డ్రైవర్​ అత్యాచారం.. బుల్డోజర్​ ప్రయోగించిన సర్కార్​..
బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ బస్సు డ్రైవర్​ ఇంటిని మధ్యప్రదేశ్​ సర్కార్​ బుల్డోజర్​తో కూల్చివేసింది. షాపురాలోని అజయ్​నగర్​లో నివాసం ఉంటున్న హనుమంత్​ స్థానికంగా ఉన్న ఓ స్కూల్​లో డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. అయితే అదే పాఠశాలలో చదువుతున్న ఓ చిన్నారిపై అతడు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో అధికారులు హనుమంత్​ ఇంటిపై బుల్డోజర్ అస్త్రాన్ని​ ప్రయోగించారు.

దివ్యాంగురాలిపై దారుణం..
దివ్యాంగురాలిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడి ఆమెను గర్భవతిని చేసిన దారుణ ఘటన మధ్యప్రదేశ్​లోని ఇందాపుర్​లో వెలుగు చూసింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

పోలీసుల సమాచారం ప్రకారం.. ఇందాపుర్​ ప్రాంతంలోని ఓ గ్రామంలో ఆరో తరగతి చదువుతున్న దివ్యాంగురాలిని గతేడాది నవంబర్‌లో శుభంగి కుచేకర్ అనే వ్యక్తి వాకింగ్‌కు తీసుకెళ్లాడు. అదే సమయంలో కారులో వచ్చిన అనిల్ నల్వాడే.. ఆమెను చెరకు తోటలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అలా పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు అనిల్​.

కొన్నిరోజుల క్రితం కడుపునొప్పి రావడం వల్ల బాధితురాలు.. బారామతిలోని ఓ ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా గర్భవతి అని తేలింది. దీంతో బాలిక తల్లి వాల్‌చంద్‌నగర్‌ పోలీస్​​స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ దుశ్చర్యలో సహకరించిన నానా బాగ్డే అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు.

ఇవీ చదవండి:
గుంతల రోడ్డుపై దొర్లుతూ సామాజిక కార్యకర్త వినూత్న నిరసన
74 ఏళ్ల తరువాత దేశంలోకి చీతాలు.. మోదీ బర్త్​డే రోజున ఆ పార్క్​లోకి విడుదల

Last Updated : Sep 15, 2022, 10:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.