Mahindra car gifts to employees: గురు పూర్ణిమ పండుగను మహారాష్ట్రలోని ఓ సంస్థ ప్రత్యేకంగా నిర్వహించింది. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు కార్లను కానుకగా ఇచ్చింది. మొత్తం 12 మంది ఉద్యోగులకు 'మహీంద్ర ఎస్యూవీ 300'లను బహూకరించింది. నాశిక్కు చెందిన 'డెయిరీ పవర్' అనే సంస్థ ఉద్యోగులకు ఇలా సర్ప్రైజ్ ఇచ్చింది. కుటుంబ సభ్యులతో కలిసి కార్లను స్వీకరించారు ఉద్యోగులు. ఈ సమయంలో కొందరు కంటతడి పెట్టారు. మహీంద్ర ఎస్యూవీ 300 వేరియంట్ ధర ప్రస్తుతం రూ.12లక్షల 60వేలుగా ఉంది. మొత్తం 3 రంగుల్లో ఉన్న కార్లను ఉద్యోగులకు ఇచ్చారు.
![Mahindra cars to employees](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/mh-nsk-carsgift-7204958_15072022153710_1507f_1657879630_784.jpg)
![Mahindra cars to employees](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/mh-nsk-carsgift-7204958_15072022153710_1507f_1657879630_799.jpg)
పాలు, పాల ఉత్పత్తులకు సంబంధించిన రంగంలో పని చేస్తోందీ 'డెయిరీ పవర్'. ఉద్యోగులే సంస్థకు గురువులని.. అందుకే గురు పూర్ణిమ రోజున వారి సేవలకు గుర్తింపుగా కార్లు అందించినట్లు కంపెనీ వ్యవస్థాపకుడు దీపక్ అవ్హాద్ తెలిపారు. ఉద్యోగులంతా ఎన్నో ఏళ్లుగా సంస్థలో నిబద్ధతతో పనిచేస్తున్నారని చెప్పారు. 'నా కంపెనీలో పనిచేస్తున్న వారంతా ఇల్లు, కారు కొనుక్కునే స్థితిలో ఉండాలని అనుకుంటూ ఉంటా. వీరి సేవలకు ప్రతిఫలంగా నేనే కార్లు ఇవ్వాలని భావించా. గురు పూర్ణిమను ఓ అవకాశంగా భావించి వాహనాలు అందించా. సంస్థను ఈ స్థాయికి తీసుకొచ్చిన ఉద్యోగులకు నా కృతజ్ఞతలు' అని వివరించారు.
![Mahindra cars to employees](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/mh-nsk-carsgift-7204958_15072022153710_1507f_1657879630_729.jpg)
ఇదీ చదవండి: