ETV Bharat / bharat

వరుసగా రెండో రోజూ తగ్గిన కరోనా కేసులు

దేశంలో రోజువారీగా నమోదయ్యే కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా 35,499 మంది వైరస్​ బారిన పడ్డారు. మరో 447 మంది మరణించారు.

Covid-19 cases
కరోనా కేసులు
author img

By

Published : Aug 9, 2021, 9:27 AM IST

Updated : Aug 9, 2021, 9:52 AM IST

దేశంలో వరుసగా రెండోరోజు కొవిడ్​ కేసుల్లో తగ్గుదల నమోదైంది. ఒక్కరోజే 35,499 మందికి వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 447 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 39,686 మంది కొవిడ్​ను జయించారు. ఫలితంగా రికవరీ రేటు 97.39 శాతానికి చేరింది.

మొత్తం కేసులు: 3,19,69,954‬

మొత్తం మరణాలు: 4,28,309

కోలుకున్నవారు: 3,11,39,457

యాక్టివ్​ కేసులు: 4,02,188

వ్యాక్సినేషన్​

దేశంలో టీకా పంపిణీ ప్రక్రియ నిర్విరమంగా కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే 16,11,590 డోసులు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. దీంతో ఇప్పటివరకు 50,86,64,759 టీకా డోసులను పంపిణీ చేసినట్లు తెలిపింది.

వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు వివరాలు..

  • కేరళలో ఒక్కరోజే 18,067 కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి ధాటికి మరో 93 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • మహారాష్ట్రలో కొత్తగా 5,508 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్​తో మరో 151 మంది మరణించారు.
  • కర్ణాటకలో ఒక్కరోజే 1,598 మందికి వైరస్ నిర్ధరణ అయింది. వైరస్ కారణంగా మరో 20 మంది చనిపోయారు.
  • తమిళనాడులో 1,956 కరోనా కేసులు వెలుగు చూశాయి. వైరస్ ధాటికి 28 మంది బలయ్యారు.
  • ఉత్తర్​ప్రదేశ్​లో కొత్తగా 58 మందికి కరోనా సోకినట్లు తేలింది. వైరస్ కారణంగా కొత్త మరణాలేవీ నమోదు కాలేదు.
  • బంగాల్​లో కొత్తగా 675 మందికి వైరస్ సోకింది. కొవిడ్​ కారణంగా మరో 12 మంది మరణించారు.
  • గుజరాత్​లో 25 కేసులు నమోదు కాగా.. మధ్యప్రదేశ్​లో కొత్తగా 17 కరోనా కేసులు నమోదయ్యాయి.
  • రాజస్థాన్​లో మరో 15 మందికి కరోనా సోకినట్లు తేలింది.
  • ఒడిశాలో కొత్తగా 1,315 మందికి వైరస్ సోకింది. కొవిడ్​ కారణంగా మరో 66 మంది మరణించారు.

ఇదీ చూడండి: పిడుగుపాటుకు 24 మంది మృతి

Last Updated : Aug 9, 2021, 9:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.