ETV Bharat / bharat

'యాస్'​ను ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు సన్నద్ధం - ఒడిశా

బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్​ తుపాను.. మరో 24 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారనున్న నేపథ్యంలో అందుకు తగిన విధంగా సన్నద్ధమవుతున్నాయి రాష్ట్రాలు. ఒడిశా బాలాసోర్​ వద్ద తీరం తాకనున్న క్రమంలో అన్ని ఏర్పాట్లు చేపట్టింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. భారీ ఎత్తున ఎన్​డీఆర్​ఎఫ్​, ఓడీఆర్​ఎఫ్​, అగ్నిమాపక బృందాలను మోహరించింది. బంగాల్​లోని​ పోర్టును మంగళవారం మూసివేస్తున్నట్లు ప్రకటించారు.

Cyclone Yaas
యాస్​ తుపాను
author img

By

Published : May 24, 2021, 8:13 PM IST

తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్​ తుపాను తీరంవైపు ముంచుకొస్తోంది. మరో 24 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం పోర్ట్​ బ్లెయిర్​కి 600 కిలోమీటర్ల దూరంలో కదులుతున్నట్లు తెలిపింది. మే 26న మధ్యాహ్నం ఉత్తర ఒడిశా-బంగాల్​ తీరంలోని పరదీప్​, సాగర్​ ద్వీపాల మధ్య తుపాను తీరం దాటనుంది. ఈ సమయంలో గంటకు 155-180 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది.

అతి తీవ్ర తుపానుగా మారునుందన్న ఐఎండీ హెచ్చరికలతో అందుకు తగిన విధంగా సన్నద్ధమవుతున్నాయి ప్రభావిత రాష్ట్రాలు.

ఒడిశాలో..

బంగాల్​ సరిహద్దు ప్రాంతమైన బాలాసోర్​ జిల్లాలో తుపాను తీరం తాకనుందన్న అంచనాలతో ఏర్పాట్లు చేపట్టింది ఒడిశా ప్రభుత్వం. భారీగా సహాయక బృందాలను తరలిస్తోంది. లోతట్టు ప్రాంతాలు, తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను భారీగా సురక్షితం ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిపారు ఎస్​ఆర్​సీ పీకే జేనా. తుపాను కారణంగా ఒక్కరు కూడా మరణించకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తున్నట్లు వివరించారు.

Cyclone Yaas
తరలుతున్న సహాయక బృందాలు

రాష్ట్రంలో బాలాసోర్​, భద్రక్​, కేంద్రపారా, జగస్టింఘ్​పుర్​ జిల్లాలపై అధిక ప్రభావం ఉంటుందని, మాయార్​భంజ్​, కియోంఝర్​ జిల్లాలపై పాక్షికంగా ఉండనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 22 ఎన్​డీఆర్​ఎఫ్​, 50 ఓడీఆర్​ఏఎఫ్ (800 మంది సిబ్బంది) బృందాలు, 150 మంది అగ్నిమాపక సిబ్బంది, చెట్లు తొలగించేందుకు 35 బృందాలను మోహిరించారు. మరో 30 ఎన్​డీఆర్​ఎఫ్ బృందాలు పంపాలను కోరారు. బాలాసోర్​ జిల్లాలో 140 తుపాను శిబిరాలతో పాటు 1102 ఇతర తాత్కాలిక కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Cyclone Yaas
సిద్ధమవుతున్న సహాయక బృందాలు
Cyclone Yaas
ఓడీఆర్​ఎఫ్​ బృందాలు

బంగాల్​లో..

బంగాల్​పై యాస్​ తుపాను తీవ్ర ప్రభావం చూపనున్న నేపథ్యంలో అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తోంది అక్కడి ప్రభుత్వం. ఈ క్రమంలో మే 25 మంగళవారం నుంచి కోల్​కతా పోర్టును మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం నుంచి నౌకల రాకను నిలిపేస్తున్నట్లు చెప్పారు. కార్మికులను ఇతర ప్రాంతాలకు తరలిస్తామని పోర్ట్​ ట్రస్ట్​ ఛైర్మన్​ వినిత్​ కుమార్​ తెలిపారు. సాయంత్రం 6 గంటల నుంచి వస్తు రవాణా వాహనాలనూ నిలిపివేస్తామన్నారు. కోల్​కతా డాక్​ సిస్టమ్​, హల్దియా డాక్​ కాంప్లెక్స్​లో కంట్రోల్​ రూంలు ఏర్పాటు చేశామన్నారు. అత్యవసర పరిస్థితుల కోసం టగ్​బోట్లు, లాంచీలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

ఎన్​డీఆర్​ఎఫ్​..

ఒడిశా, బంగాల్​లోని ఆక్సిజన్​ ఉత్పత్తి కేంద్రాలపై తుపాను ప్రభావం లేకుండా చూడాలని సహాయక బృందాలకు సూచించింది ఎన్​డీఆర్​ఎఫ్​. 149 టీంలు సహాయక చర్యలు, ప్రజల తరలింపులో పాల్గొంటుండగా, 99 బృందాలను క్షేత్రస్థాయిలో మోహరించామని ఎన్​డీఆర్​ఎఫ్​ డీజీ తెలిపారు. మరో 50 బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు.

Cyclone Yaas
ఎన్​డీఆర్​ఎఫ్​ సిబ్బంది

ఇదీ చూడండి: యాస్​ తుపాను: రంగంలోకి హెలికాప్టర్లు, విమానాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.