ETV Bharat / bharat

11 కేజీల గోల్డ్ బిస్కెట్లు సీజ్​.. కార్​లో సీక్రెట్ చాంబర్స్.. ఓపెన్ చేస్తే రూ.కోటి! - గోల్డ్ బిస్కట్లు

ఇంఫాల్ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న 11 కేజీల బంగారు బిస్కెట్లను సీజ్ చేశారు కస్టమ్స్​ అధికారులు. వీటి విలువ రూ.5.76 కోట్లు ఉంటుందని చెప్పారు. మరో ఘటనలో కేరళలో భార్యాభర్తల నుంచి రూ.కోటి నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

GOLD BISCUIT
11 కేజీల గోల్డ్ బిస్కెట్లు సీజ్​.
author img

By

Published : Apr 25, 2022, 4:58 PM IST

Imphal gold seize: బిస్కెట్ల రూపంలో దాదాపు 11 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని ఇంఫాల్ కస్టమ్స్ విభాగం అధికారులు పట్టుకున్నారు. అతను ఎయిర్ ఏసియా విమానంలో ఇంఫాల్​ నుంచి దిల్లీ వెళ్లే క్రమంలో తనిఖీలు నిర్వహించి గట్టు రట్టు చేశారు. బంగారం అక్రమ రావాణా జరుగుతోందనే పక్కా సమాచారంతో ఇంఫాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం ముమ్మర తనిఖీలు చేసి స్మగ్లర్​ను అదుపులోకి తీసుకున్నారు.

Gold smuggling news: బంగారం తరలిస్తున్న వ్యక్తిని వాహెంగ్​బామ్​ ఇంబుంగోబి సింగ్​గా గుర్తించారు అధికారులు. ఇతను ఇంఫాల్​ మానింగ్ లికాయ్​లోని అవాంగ్​ ఖునౌకు చెందినవాడని చెప్పారు. స్మగ్లింగ్​పై పక్కా సమాచారంతో ఎయిర్ ఏసియా సిబ్బందిని ముందే అప్రమత్తం చేసి చాకచక్యంగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. స్మగ్లర్​పై అనుమానంతో అతడ్ని ఎక్స్​రే విషన్ ముందు ఉండమన్నారు అధికారులు. అయితే ఆ బ్యాగ్ తనది కాదని, దాన్ని ఇంఫాల్​ నుంచి దిల్లీకి చేరవేస్తే డబ్బులు ఇస్తామని మరొకరు చెప్పడం వల్ల తీసుకెళ్తున్నట్లు సదరు వ్యక్తి అధికారులతో బుకాయించాడు. చివరకు బ్యాగును తెరిచి చూడగా.. మొత్తం 10.79కేజీల బరువున్న 65 బంగారు బిస్కెట్లు ఉన్నాయని, వాటి విలువ రూ.5.76 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ పసిడి విదేశీ మూలాలకు చెందిందని పేర్కొన్నారు. లగేజీ బ్యాగులో ఓ బ్లాంకెట్ మధ్యలో పాస్టిక్​ కవర్లో బంగారాన్ని నిందితుడు దాచినట్లు వివరించారు.

GOLD BISCUIT
11 కేజీల గోల్డ్ బిస్కెట్లు సీజ్​.
GOLD BISCUIT
11 కేజీల గోల్డ్ బిస్కెట్లు సీజ్​.

భార్యాభర్తల వద్ద రూ.కోటి: కేరళ మలప్పురంలోని వలంచేరి వద్ద భార్యాభర్తల నుంచి రూ.కోటి నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 117 సవర్ల బంగారాన్ని కూడా సీజ్ చేశారు. మహారాష్ట్రకు చెందిన వీరు కోయంబత్తూర్​ నుంచి మలప్పురంలోని వెంగారకు ఈ డబ్బును తరలిస్తుండగా పట్టుకున్నారు.

ఈ డబ్బు, బంగారానికి సంబంధించి ఎలాంటి కాగితాలను భార్యాభర్తలు చూపించలేదని, తమ వద్ద అలాంటివేమీ లేవని ఒప్పుకున్నారని పోలీసులు చెప్పారు. కారులో ఏర్పాటు చేసిన రహస్య చాంబర్స్​లో నోట్ల కట్టలు, బంగారాన్ని దాచి ఉంచారని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో వలంచేరి పోలీసులు భారీ మొత్తంలో హవాలా డబ్బును గుర్తిస్తున్నారు. ఆరు ఘటనల్లో రూ.8 కోట్ల నగదును సీజ్ చేశారు.

cash seize
భార్యాభర్తల కారులో రూ.కోటి నగదు..
cash seize
భార్యాభర్తల కారులో రూ.కోటి నగదు..

ఇదీ చదవండి: పీకే​కు కాంగ్రెస్​ షరతు.. అందుకు ఓకే అంటేనే పార్టీలోకి.. తెరాస, వైకాపాతో కటీఫ్​?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.