ETV Bharat / bharat

Crocodile Washed Away by Flood Water in Nala at Hyderabad : నాలాలో మొసలి ప్రత్యక్షం.. భయాందోళనలో నగరవాసులు - హైదరాబాద్​లో నాలాలో కొట్టుకొచ్చిన మొసలి

Crocodile Washed Away by Flood Water in Nala at Hyderabad : హైదరాబాద్​లో భారీ వర్షానికి మొసలి పిల్ల నాలా నుంచి కొట్టుకుని వచ్చింది. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఖైరతాబాద్​ చింతల్​బస్తీ వద్ద మొసలి పిల్ల ఒడ్డుకు చేరింది.

Crocodile Washed Away by Flood Water
Crocodile Washed Away by Flood Water in Nala at Hyderbad
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 27, 2023, 8:29 PM IST

Updated : Sep 27, 2023, 9:39 PM IST

Crocodile Washed Away by Flood Water in Nala at Hyderabad : హైదరాబాద్​ నగరంలోని నాలాలో మొసలి పిల్ల(Crocodile) కొట్టుకు రావడం కలకలం రేపింది. ఖైరతాబాద్‌(Khairatabad) చింతల్‌బస్తీ వద్ద మొసలి పిల్ల నాలాలో కొట్టుకు రావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి బల్కాపూర్‌ నాలా ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ ప్రవాహానికి మొసలి పిల్ల నీటిలో కొట్టుకువచ్చింది. ఆనంద్​నగర్​, చింతల్​ బస్తీ మధ్య నూతన వంతెన నిర్మాణం కోసం కూల్చివేతలు చేపట్టిన ప్రాంతంలో ఒడ్డుకు చేరింది.

నాలాలో మొసలి
నాలాలో మొసలి

గమనించిన స్థానికులు అటవీశాఖ, జీహెచ్‌ఎంసీ, పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడకు చేరుకుని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. నాలాపై నిర్మాణ పనులు మూడు నెలలు గడుస్తున్నా.. పూర్తికాకపోవడం అదే ప్రాంతంలో మొసలి కొట్టుకురావడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్​ఎంసీ అధికారులు సూచించారు.

Crocodile in Crop Field in Wanaparthi : అలాగే ఈ ఏడాది మార్చి నెలలో వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలో పెద్ద మొసలి పంట పొలాల్లో ప్రత్యక్షమైంది. నదిలో ఉండాల్సిన మొసలి ఇలా పంట పొలాల్లో ఉండడంతో ఆశ్చర్యానికి లోనైయ్యారు. బాల్​ రెడ్డి అనే రైతు పొలంలో ఇది కనిపించింది. పనుల కోసం పంట దగ్గరకు వెళ్లిన రైతులకు అక్కడ భారీ మొసలిని చూశారు. వెంటనే భయాందోళనలతో జిల్లా స్నేక్​ సొసైటీ నిర్వహకులకు సమాచారం అందించారు. వెంటనే సమాచారం అందుకున్న అధికారులు.. గ్రామానికి చేరుకొని మొసలిని తాడుతో కట్టి బంధించారు. పొలంలో నుంచి బయటకు జాగ్రత్తగా తీసుకువచ్చి.. జూరాల ప్రాజెక్టులో వదిలేశారు. దీని బరువు 270 కేజీలు కాగా.. 12 అడుగలు పొడవు ఉంది. ఈ మొసలిని చూసేందుకు గ్రామస్థులు, చుట్టుపక్కల ఊళ్లో వాళ్లు తరలివచ్చారు.

గ్రామంలోకి మొసలి.. స్థానికులు హడల్.. 3గంటల పాటు శ్రమించి..

Crocodile Flood Water in Hyderabad : గతంలో కూడా మూసీ నదికి వరద ప్రవాహం వచ్చినప్పుడు అత్తాపూర్​ వద్ద మొసలి కలకలం రేపింది. హిమాయత్​సాగర్​, ఉస్మాన్​సాగర్​ గేట్లు ఎత్తడంతో మూసీ వరద ప్రవాహానికి వరద కొట్టుకువచ్చింది. స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు అక్కడ సూచిక బోర్డును ఏర్పాటు చేశారు. భారీ వర్షాలకు మూసీ నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అప్పటి నుంచి సూచించారు. అలాగే నిజామాబాద్​ జిల్లాలోని రెంజర్ల చెరువులో కూడా రెండేళ్ల క్రితం మొసలి కనిపించింది. అయితే అది చెరువులోకి వెళ్లిపోయింది.

నది ఒడ్డున బట్టలు ఉతుకుతున్న మహిళ.. ఒక్కసారిగా మొసలి దాడి చేసి.. నీటిలోకి లాక్కెళ్లి..

స్కూల్ టాయిలెట్​లో 7 అడుగుల మొసలి.. రెండు గంటలు శ్రమించి..

Last Updated : Sep 27, 2023, 9:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.