బిహార్ బంకా జిల్లా శంకర్పుర్లోని మహదేవ్ ఎన్‌క్లేవ్‌లో ఉన్న ధర్మాకాంటాపై దుండగులు దాడి చేశారు. ధర్మాకాంటాలో బాంబులు వేసి.. కాల్పులు జరిపి రూ.11 లక్షలు దోచుకెళ్లారు.
మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో శంకర్‌పుర్ మహదేవ్ ఎన్‌క్లేవ్‌లో ఉన్న ధర్మకాంటాలో 8నుంచి 10 మంది దొంగలు చొరబడ్డారు. బాంబులు వేశారు. కాల్పులు జరిపారు. ఈ దాడిలో ధర్మాకాంటాలో పని చేసే ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడ్డవారు ప్రస్తుతం భగల్పుర్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడి దృశ్యాలు సీసీ టీవీలో నిక్షిప్తమయ్యాయి.
ఇదీ చదవండి : 'యాస్' ఉగ్రరూపం- 11 లక్షల మంది తరలింపు