ETV Bharat / bharat

మూడు క్రిమినల్​ బిల్లులకు లోక్​సభ ఆమోదం- బ్రిటిష్ కాలంనాటి సెక్షన్లకు చెక్!

Criminal Law Bill Passed : బ్రిటిష్ కాలం నాటి చట్టాల స్థానంలో తీసుకువచ్చిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య బిల్లులకు లోక్​సభ ఆమోదం తెలిపింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టగా, మూజువాణి ఓటుతో దిగువ సభ ఆమోదించింది.

criminal law bill passed
criminal law bill passed
author img

By PTI

Published : Dec 20, 2023, 5:19 PM IST

Updated : Dec 20, 2023, 7:00 PM IST

Criminal Law Bill Passed : కేంద్రం ప్రవేశపెట్టిన మూడు నూతన క్రిమినల్‌ బిల్లులు లోక్‌సభ ఆమోదం పొందాయి. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య బిల్లులపై చర్చ, కేంద్రం సమాధానం అనంతరం మూడు బిల్లులకు దిగువసభ బుధవారం మూజువాణి ఓటుతో ఆమోదముద్ర వేసింది. నూతన బిల్లులపై లోక్‌సభలో జరిగిన చర్చకు సమాధానం ఇచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారతీయతను, రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతిబింబించేలా దేశ ప్రజల హితం కోరి నూతన క్రిమినల్ బిల్లులు తెచ్చినట్లు ప్రకటించారు. బ్రిటిష్‌ కాలం నాటి చట్టాలను నూతన బిల్లులు భర్తీ చేస్తాయని ఆయన ప్రకటించారు. ప్రజలకు న్యాయం చేసేందుకు నూతన చట్టాల్లో సాంకేతికతకు ప్రోత్సాహం ఇచ్చినట్లు చెప్పారు. మూక హత్యలను నేరంగా పరిగణించినట్లు చెప్పారు. బ్రిటిష్ చట్టాలు వారి రాజరిక పాలనను రక్షించుకునేందుకు తెస్తే, తాము ప్రజలే కేంద్రంగా నూతన బిల్లులను తెచ్చామన్నారు.

  • #WATCH | Delhi: Home Minister Amit Shah in Lok Sabha says, "A provision for Trial in Absentia has been introduced...Many cases in the country shook us be it the Mumbai bomb blast or any other. Those people are hiding in other countries and trials are not underway. They don't need… pic.twitter.com/BCT5bYL0jL

    — ANI (@ANI) December 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"మోదీ నేతృత్వంలో తెచ్చిన 3 బిల్లులు.. న్యాయం, సమానత్వం, నిష్పాక్షకత మూల సిద్ధాంతంగా చాలా పెద్ద మార్పులు తీసుకుని వచ్చాయి. సాంకేతికతతో చాలా ఉపయోగం ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో సాంకేతికంగా ఏమేమి నూతన ఆవిష్కరణలు వచ్చే అవకాశం ఉందో ఊహించడం ద్వారా ఇప్పుడు ఈ చట్టాల్లో అనేక నిబంధనలు చేర్చాం. ఫోరెన్సిక్ సైన్స్‌ను ఈ చట్టాల్లో జోడించాం. ఈ చట్టాల ద్వారా త్వరగా న్యాయం చేసేందుకు పోలీసులు, న్యాయవాదులు, న్యాయమూర్తి అందరికీ తగిన సమయం ఇచ్చే ప్రయత్నం చేశాం."

--అమిత్ షా, కేంద్ర హోంమంత్రి

ఈ బిల్లులో ఉగ్రవాదానికి నిర్వచనం ఇచ్చామని అమిత్ షా తెలిపారు. రాజద్రోహాన్ని తొలగించి దాని స్థానంలో కొత్త సెక్షన్​ను తీసుకొచ్చామన్నారు. తీవ్రవాద చర్యలకు పాల్పడే వారికి కఠినశిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశారు. ఎవరైనా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే వారిని శిక్షించరాదన్న ఆయన, అది వారి భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పారు. సీఆర్‌పీసీలో 484 సెక్షన్లు ఉండగా కొత్త బిల్లులో 531 సెక్షన్లు చేర్చినట్లు వివరించారు. 177 సెక్షన్లలో మార్పులు చేసి 9 సెక్షన్లు అదనంగా చేర్చామని తెలిపారు. 39 సబ్‌ సెక్షన్లు, 44 నూతన ప్రొవిజన్లు చేరాయని అమిత్ షా అన్నారు.

  • #WATCH | Delhi: Home Minister Amit Shah in Lok Sabha says, "In CrPC there were 484 sections, now there will be 531 sections in it. Changes have been made in 177 sections and 9 new sections have been added. 39 new sub-sections have been added. 44 new provisions have been added..." pic.twitter.com/pqdN1O2Tmr

"ప్రస్తుతం ఉన్న మూడు చట్టాలు విదేశీయులు తమ అధికారాన్ని చలాయించడానికి తీసుకొచ్చినవి. దేశంలో ప్రజలను బానిసలుగా చేసి వారిని పాలించాలని బ్రిటిషర్లు తీసుకొచ్చిన చట్టాలివి. వాటి స్థానంలో వస్తున్న కొత్త చట్టాలు మన రాజ్యాంగంలోని మూల సిద్ధాంతాలకు అనుగుణంగా ఉంటాయి. వ్యక్తి స్వేచ్ఛ, మానవ అధికారాలు, సమానత్వం ఈ మూడు మూల సిద్ధాంతాల ఆధారంగా కొత్త చట్టాలు రూపుదిద్దుకున్నాయి. పాత చట్టాలు, కొత్త చట్టాలకు ఇదే ప్రధానమైన తేడా. దీన్ని కొంత మంది గుర్తించలేకపోతున్నారు. పాత చట్టాలను జాగ్రత్తగా పరిశీలిస్తే వాటిలో న్యాయం చేయాలనే ఆలోచనే ఉండదు. శిక్షించడమే న్యాయం చేయడం అనే భావనలో అవి ఉన్నాయి. మన శాస్త్రాల్లో శిక్షించడం కంటే న్యాయం అందించడంపైనే దృష్టి ఎక్కువగా ఉంటుంది. బాధితుడికి న్యాయం అందాలనే ఉద్దేశంతోనే మన వద్ద శిక్ష విధిస్తారు."

--అమిత్‌ షా, కేంద్ర హోంమంత్రి

అంతకుముందు ఈ ఏడాది ఆగస్టులో జరిగిన పార్లమెంట్‌ సమావేశాల్లో తొలిసారి ఈ బిల్లులను ప్రవేశపెట్టారు. అయితే, వీటిపై ప్రతిపక్షాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవడం వల్ల ఇప్పుడు శీతాకాల సమావేశాల్లో వీటిని కేంద్రం వెనక్కు తీసుకుంది. ఆ తర్వాత వీటిలో మార్పులు చేసి భారతీయ న్యాయ (రెండో) సంహిత, భారతీయ నాగరిక్‌ సురక్షా (రెండో) సంహిత, భారతీయ సాక్ష్య (రెండో) బిల్లులను మరోసారి ప్రవేశపెట్టారు హోంమంత్రి. తాజాగా ఈ మూడు బిల్లులను దిగువ సభ ఆమోదించడం వల్ల వాటిని రాజ్యసభకు పంపనున్నారు. ఈ శీతాకాల సమావేశాల్లోనే వీటిని ఆమోదించుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఉభయ సభల్లో ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి సంతకంతో ఈ బిల్లులు చట్టంగా మారనున్నాయి. డిసెంబరు 22 వరకు శీతాకాల సమావేశాలు జరగనున్నాయి.

టెలికాం, జీఎస్​టీ బిల్లుకు ఆమోదం
మూడు క్రిమినల్​ బిల్లులతో పాటు టెలికాం బిల్లు 2023ను ఆమోదించింది లోక్​సభ. మరోవైపు అప్పీలెట్​ సభ్యులు, ప్రెసిడెంట్​ వయసు పెంచుతూ ప్రవేశపెట్టిన జీఎస్​టీ సవరణ బిల్లు, ప్రొవిజనల్​ కలెక్షన్​ ఆఫ్​ టాక్సెస్​ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది.

మరో ఇద్దరు ఎంపీలపై వేటు- కొనసాగుతున్న సస్పెన్షన్ల పర్వం

పార్లమెంట్​లో ఆగని నిరసనలు- మరో 49మంది లోక్​సభ ఎంపీలపై సస్పెన్షన్​ వేటు

Last Updated : Dec 20, 2023, 7:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.