ఎమ్డీఎమ్ఏ డ్రగ్స్ కేసులో మరొకరు అరెస్టు - మాదక ద్రవ్యాల కేసు
ఎమ్డీఎమ్ఏ మాదక ద్రవ్యాల కేసులో మరో నిందితుడ్ని ఇందోర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ముంబయి, ఇందోర్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తాడని తెలిపారు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్డీఎమ్ఏ మాదకద్రవ్యాల కేసులో మరో నిందితుడ్ని మధ్యప్రదేశ్ ఇందోర్ పోలీసులు అరెస్టు చేశారు. అతడ్ని ముంబయికి చెందిన గులాం హైదర్‌గా గుర్తించారు. ఇందోర్, ముంబయిలో డ్రగ్స్ సరఫరా చేస్తాడని వెల్లడించారు.


నిందితుడి నుంచి కారు, సిమ్‌కార్డులను, కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ కేసుతో ఎవరెవరికి సంబంధం ఉందన్న కోణంలో ప్రశ్నిస్తున్నారు.
కొన్ని నెలల క్రితం ఇందోర్ పోలీసులు 70 కేజీల ఎమ్డీఎమ్ఏ డ్రగ్స్‌ను పట్టుకున్నారు. దీని విలువ దాదాపు రూ.70కోట్లు ఉంటుందని తేల్చారు. కేసుకు సంబంధం ఉన్న ఐదుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. విచారణలో లభించిన సమాచారం ఆధారంగా మరో 24మందిని అరెస్టు చేశారు.