ICC Men Cricket World Cup 2023 Trophy Displayed in Ramoji Film City : వచ్చే నెల 5వ తారీఖు నుంచి భారత్‌లో క్రికెట్ మేనియా మొదలవ్వబోతుంది. ఈ సంబురాలను మరింత రెట్టింపు చేస్తూ... క్రికెట్ వరల్డ్ కప్ ట్రోఫీ(ICC World Cup 2023) టూర్‌లో భాగంగా రామోజీ ఫిల్మ్ సిటీ(Ramojifilm city) వేదికైంది. రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి, ప్రియా ఫుడ్స్ డైరెక్టర్ సహరి ట్రోఫీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఈనాడు ఎండీ కిరణ్, ఈనాడు ఏపీ, తెలంగాణ ఎడిటర్లు నాగేశ్వరరావు, డీఎన్ ప్రసాద్, ఈటీవీ సీఈఓ బాపినీడు, రామోజీ గ్రూప్ సంస్థల ప్రెసిడెంట్ హెచ్‌ఆర్ గోపాల్‌రావుతోపాటు సంస్థల పలు విభాగాధిపతులు, సిబ్బంది పాల్గొన్నారు. భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీ అక్టోబర్‌లో ప్రారంభంకాబోంది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగబోతున్న ఈ వరల్డ్ కప్‌లో మొత్తం 10 దేశాలు పాల్గొనబోతున్నాయి.
Cricket World Cup 2023 : భారత్‌లో జరిగే ఈ టోర్నీ కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ), బీసీసీఐ సంయుక్తంగా కొత్త తరహాలో ప్రచారాన్ని మొదలు పెట్టాయి. టోర్నీ ప్రారంభంకావడానికి 100 రోజుల ముందుగానే... వరల్డ్ కప్ ట్రోఫీని ఏకంగా అంతరిక్షంలోకి పంపించి టోర్నీపై ఆసక్తిని పెంచాయి. బిస్పోక్ బెలూన్‌తో జత చేసిన ట్రోఫీ భూమి నుంచి 1 లక్షా 20 వేల అడుగుల ఎత్తులో ఉన్న ‘స్ట్రాటోస్ఫియర్’ను చేరింది. అక్కడ ఉన్న ట్రోఫీని 4కె కెమెరాతో కొన్ని షాట్స్ తీశారు.
Cricket World Cup 2023 Trophy in Ramoji Film City : ఈ క్రికెట్ వరల్డ్ కప్ ట్రోఫీ ఒరిజినల్. టోర్నీలో గెలిచిన జట్టుకు ట్రోఫీ నమూనాను బహూకరిస్తారు. ఏవైపు నుంచి చూసినా కూడా ఒకే మాదిరిగా కనిపించడం ఈ ట్రోఫీ ప్రత్యేకత. 60 సెంటీమీటర్ల ఎత్తు, దాదాపు పదకొండున్నర కిలోల బరువున్న ఈ ట్రోఫీ కింది భాగంలో... ఇప్పటివరకూ గెలిచిన జట్లు పేర్లను ముద్రించారు. మరో పది జట్ల పేర్లను కూడా ముద్రించేలా ఇంకా స్థలం ఉంది.
ICC World Cup 2023 : వరల్డ్ కప్ ఎఫెక్ట్.. ఒక్కరోజుకు లక్షల్లో ఛార్జీలు!
ICC World Cup 2023 in India : భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీ అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరుగుతుంది. ఈ పది జట్లలో పోటీలకు ఆతిథ్యం ఇచ్చే జట్టుకు కచ్చితంగా పాల్గొనే అర్హత ఉంటుంది. ఆతిథ్య దేశాల్లో సుమారు నెలరోజుల పాటు వివిధ వేదికల మీద పోటీలు జరుగుతాయి. 2027 లో జరగబోయే ప్రపంచకప్ లో 14 జట్లు పాల్గొనేలా విధానాలు రూపొందిస్తున్నారు. ఎప్పుడెప్పుడా ప్రపంచకప్ మొదలవుతుందని క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ICC World Cup Anthem 2023 : వరల్డ్ కప్ యాంథమ్ వచ్చేసిందోచ్.. ఇక అందరూ అంటారు 'దిల్ జషన్ బోలే'