ETV Bharat / bharat

ఒక్కరోజులో 80 లీటర్ల పాలు ఇచ్చిన ఆవు- ఆసియా రికార్డ్ బ్రేక్- బుల్లెట్ బండి విన్ - 80 లీటర్ల పాలు ఇచ్చిన ఆవు

Cow 80 Litre Milk : హరియాణాలో ఓ ఆవు ఒక్కరోజులో 80 లీటర్లకు పైగా పాలు ఇచ్చింది. ఓ పోటీలో భాగంగా రోజులో మూడుసార్లు యంత్రాల ద్వారా పాలు పితికారు. 80 లీటర్ల పాలు ఇచ్చిన ఆ ఆవు ఆసియా రికార్డు కొల్లగొట్టింది.

Cow 80 Litre Milk
Cow 80 Litre Milk
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 11, 2024, 2:19 PM IST

ఒక్కరోజులో 80 లీటర్ల పాలు ఇచ్చిన ఆవు

Cow 80 Litre Milk : హరియాణాకు చెందిన ఓ ఆవు 24 గంటల వ్యవధిలో 80 లీటర్ల పాలు ఇచ్చి రికార్డు సృష్టించింది. కురుక్షేత్రలో నిర్వహించిన పోటీల్లో 'షకీరా మిల్కింగ్ ఛాంపియన్' అనే ఆవు ఈ రికార్డు సాధించింది. కర్నాల్ జిల్లాలోని ఝిఝారీకి చెందిన సునీల్, శాంకీ అనే ఇద్దరు సోదరులు ఈ ఆవును పెంచుతున్నారు. పోటీలో భాగంగా 8 గంటల విరామం ఇస్తూ రోజులో మూడుసార్లు యంత్రాల ద్వారా ఆవుకు పాలు పితికారు. 80 లీటర్లకు పైగా పాలు ఇచ్చిన షకీరా.. పోటీలో తొలి స్థానంలో నిలిచి బుల్లెట్ బైక్​ను సొంతం చేసుకుంది. దీంతో పాటు ఆసియా రికార్డును సైతం కైవసం చేసుకుంది.

Cow 80 Litre Milk
షకీరా ఆవు

"ఆసియాలోనే ఎక్కువ పాలు ఇచ్చిన ఆవుగా ఇది రికార్డు సాధించింది. 80 కిలోల 765 గ్రాములు పాలు ఇచ్చింది. డీఎఫ్ఐ అనే అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. హరియాణా, పంజాబ్ సహా దూర ప్రాంతాల నుంచి అనేక ఆవులు పోటీలో పాల్గొన్నాయి. ఎక్కువ పాలిచ్చి ఈ ఆవు తొలి స్థానంలో నిలిచింది. డీఎఫ్ఐ ఇప్పటికి ఐదుసార్లు పోటీలు నిర్వహించింది. ప్రతిసారి మా ఆవు విజేతగా నిలుస్తూ వస్తోంది. ఒక్కసారి మాత్రమే రెండో స్థానంలో నిలిచింది. మిగిలిన అన్నిసార్లు తొలి స్థానం సంపాదించింది."
-సునీల్, షకీరా ఆవు యజమాని

Cow 80 Litre Milk
బుల్లెట్ బండిపై శాంకీ, సునీల్

సునీల్, శాంకీ గత పన్నెండేళ్లుగా పాడిపశువులను పెంచుతున్నారు. వారి డెయిరీ ఫామ్​లో 120 వరకు చిన్న, పెద్ద పశువులు ఉన్నాయి. షకీరా వయసు ఆరున్నరేళ్లు. హోల్​స్టైన్ ఫ్రీజన్ జాతికి చెందిన ఈ ఆవు 145 సెంటీమీటర్ల ఎత్తు, 165 సెంటీమీటర్ల పొడవు ఉన్నట్లు సునీల్ వివరించాడు. ఈ ఆవును అన్ని పశువులతో కలిపే పెంచుతున్నట్లు చెబుతున్నారీ సోదరులు. ఎక్కువగా పచ్చి, ఎండు గడ్డి పెడతామని చెప్పారు. పోటీ ఉన్న సమయంలో మాత్రం ఆవు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటామని వివరించారు. 'షకీరా ఎప్పుడూ అన్ని ఆవులతో కలిసే ఉంటుంది. తిండి కూడా ప్రత్యేకంగా ఏమీ ఉండదు. పోటీ ఉన్న సమయంలో దాన్ని ఒంటరిగా ఉంచుతాం. తిండి ఎలా తింటుందనేది గమనిస్తూ ఉంటాం. కానీ పోటీ తర్వాత మాత్రం అన్ని ఆవులతోనే ఉంచుతాం' అని సునీల్ తెలిపాడు.

Cow 80 Litre Milk
షకీరా ఆవు
Cow 80 Litre Milk
షకీరా ఆవు

హార్లీ డేవిడ్​సన్ బైక్​పై ఇంటింటికీ తిరుగుతూ పాల వ్యాపారం

పాలు ఇస్తున్న 29 రోజుల లేగ దూడ.. రోజుకు ఎంతంటే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.