ETV Bharat / bharat

కొవిషీల్డ్​ పనితీరుపై సీరం స్పష్టత - సీరం

కరోనా వ్యాక్సిన్​ కొవిషీల్డ్​పై చెన్నైకు చెందిన ఓ వలంటీర్​ చేసిన ఆరోపణలపై మరోమారు స్పష్టతనిచ్చింది సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా. తమ టీకా పూర్తిగా సురక్షితం, ఇమ్యునోజెనిక్​ అని నొక్కిచెప్పింది. అవసరమైన అన్ని నియంత్రణ, నైతిక ప్రక్రియలు, నిబంధనలు పాటించినట్లు వెల్లడించింది. సంస్థ ప్రతిష్ఠను కాపాండేందుకు ఆరోపణలు చేసిన వలంటీర్​కు లీగల్​ నోటీసులు పంపించినట్లు తెలిపింది.

Serum institute of India
సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా
author img

By

Published : Dec 1, 2020, 1:59 PM IST

కొవిషీల్డ్​ వ్యాక్సిన్​ సురక్షితం, ఇమ్యునోజెనిక్​ అని నొక్కిచెప్పింది సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా(ఎస్​ఐఐ). చెన్నై వలంటీర్​కు ఎదురైన సమస్య తమ టీకా వల్ల కాదని మరోమారు స్పష్టం చేసింది. టీకా అభివృద్ధి, క్లినికల్​ ట్రయల్స్​లో అవసరమైన అన్ని నియంత్రణ, నైతిక ప్రక్రియలు, మార్గదర్శకాలు కచ్చితంగా పాటించామని వెల్లడించింది.

" కొవిషీల్డ్​ వ్యాక్సిన్​ సురక్షితం, ఇమ్యునోజెనిక్​. చెన్నై వలంటీరుకు జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమే అయినప్పటికీ టీకా వల్ల కాదు. వలంటీర్​ ఆరోగ్య పరిస్థితిపై సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా సానుభూతితో ఉంది. అన్ని రకాల నియంత్రణ, నైతిక ప్రక్రియలు, మార్గదర్శకాలను కచ్చితత్వంతో అనుసరించామని స్పష్టం చేస్తున్నాం. దీనిపై సంబంధిత అధికారులకు సమాచారం అందించాం. డీఎస్​ఎంబీ, నైతిక విలువల కమిటీ స్వతంత్రంగా పరిశీలించి ఈ సమస్యతో వ్యాక్సిన్​ ట్రయల్స్​కు సంబంధం లేదని తేల్చాయి. ఈ సంఘనటకు సంబంధించిన నివేదికలు, సమాచారాన్ని భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ)కి పంపించాం. అవసరమైన అన్ని ప్రక్రియలను పూర్తి చేసిన తర్వాతే ట్రయల్స్​ను కొనసాగిస్తున్నాం."

- సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా

టీకా, రోగనిరోధకత గురించి సంక్లిష్టతలు, ఇప్పటికే ఉన్న తప్పుడు ప్రచారాన్ని పరిగణనలోకి తీసుకుని, సంస్థ ప్రతిష్ఠను కాపాడేందుకు ఆరోపణలు చేసిన వలంటీరుకు లీగల్​ నోటీసులు పంపించినట్లు తెలిపింది సంస్థ.

ఇవీ చూడండి: 'చెన్నై వలంటీర్​ నుంచి రూ. 100కోట్లు వసూలు చేస్తాం'

'కొవిషీల్డ్ వికటించింది.. రూ.5 కోట్లు ఇవ్వండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.