ETV Bharat / bharat

టీకా పంపిణీ కోసం అందుబాటులోకి కొవిన్​ యాప్​ - కొవిన్ యాప్

ప్రతి ఒక్కరికి టీకా పంపిణీని నిర్ధరించేందుకు త్వరలో కొవిన్ యాప్‌ను అందుబాటులోకి తేనుంది కేంద్రం. దీని ద్వారా టీకాల నిల్వను డిజిటల్‌గా ట్రాక్‌ చేసేందుకు వీలుంటుంది. వ్యాక్సిన్​ లభ్యత, సేకరణకు సంబంధించిన సమాచారాన్ని అందుబాటులో ఉంచనున్నారు. అలాగే టీకా లబ్ధిదారుల గురించి సమాచారం ఇవ్వనుంది ఈ యాప్.

COVIN APP
కొవిన్​ యాప్​
author img

By

Published : Nov 21, 2020, 10:31 PM IST

ఫైజర్, మోడెర్నా, ఆస్ట్రాజెనికా వంటి పలు ఔషధ సంస్థలు తమ టీకా సామర్థ్యం గురించి ప్రకటనలు చేస్తున్నాయి. ఈ తరుణంలో ప్రతి ఒక్కరికి టీకా పంపిణీని నిర్ధరించేందుకు త్వరలో 'కొవిన్' యాప్‌ను అందుబాటులోకి తేనుంది కేంద్ర ప్రభుత్వం.

కొవిన్ యాప్ ద్వారా టీకాల నిల్వను డిజిటల్‌గా ట్రాక్‌ చేసేందుకు వీలు కల్పిస్తారు. వ్యాక్సిన్​ లభ్యత, సేకరణకు సంబంధించిన సమాచారాన్ని అందుబాటులో ఉంచనున్నారు. అలాగే టీకా లబ్ధిదారుల గురించి సమాచారం ఇవ్వనుంది ఈ యాప్.

ఇవిన్​ వ్యవస్థకు సంస్కరణ..

యూనివర్సల్ ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో గతంలో ఉపయోగించిన ఇవిన్ వ్యవస్థకు వేగవంతమైన, మెరుగైన సంస్కరణ అని ఇటీవల కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ వెల్లడించారు.

"మొత్తం ఇవిన్‌ ప్లాట్‌ఫాం కొవిన్‌ నెట్‌వర్క్‌గా మెరుగులు దిద్దుకుంది. ఈ యాప్‌ ద్వారా నిల్వ గురించిన సమాచారాన్ని డిజిటల్‌గా ట్రాక్ చేయవచ్చు. అలాగే టీకాకు రెండు షాట్లు అవసరం కాబట్టి మొదటి షాట్ పొందిన వారిని రెండుమూడు వారాల తర్వాత ఈ యాప్‌ ద్వారా గుర్తించవచ్చు" అని హర్షవర్ధన్ తెలిపారు.

కరోనా టీకా పురోగతి, పంపిణీకి సంబంధించిన సంసిద్ధతపై ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సమావేశం నిర్వహించారు.

ఇదీ చూడండి: 'చివరి దశకు చేరుకున్న కరోనా అధ్యయనం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.