పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా రాత్రి కర్ఫ్యూని అమలు చేస్తోంది త్రిపుర ప్రభుత్వం. ఆ రాష్ట్ర రాజధాని అగర్తలాలో కర్ఫ్యూ నిబంధనలు ఏ మేరకు అమలు అవుతున్నాయో తెలుసుకునేందుకు స్వయంగా సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ స్థానిక వీధుల్లో తిరిగారు. ఈ సమయంలో ఆయన వెంట అధికారులూ ఉన్నారు. స్థానికంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం.. సిబ్బందితో పాటు వైద్యాధికారులుతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి.. ఇప్పటికే రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో కొవిడ్ పరిస్థితిపై సమీక్షించారు. మొదటి నుంచి కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనే దిశగా ముందుడి పోరాడుతున్నారు బిప్లవ్.
ఈ నేపథ్యంలో మీడియోతో మాట్లాడారు త్రిపుర సీఎం. కరోనా చికిత్సను జిల్లా స్థాయికి, సబ్ డివిజన్ స్థాయి వరకూ తీసుకువెళ్లినట్లు తెలిపారు. కొవిడ్ రోగులకు వారి సొంత జిల్లాలోనే వైద్యసదుపాయాలను అందిస్తున్నట్లు తెలిపారు. కరోనా మొదటి దశలో ఇతర ప్రాంతాలకు వెళ్లి వైద్యసేవలు చేయించుకున్నారని.. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని వివరించారు. ఇది రాష్ట్రంలో ఆరోగ్య మౌలిక సదుపాయాల మెరుగుదలను నిదర్శనమని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: జనాభా కట్టడిపై పిల్లో కక్షిదారుగా ఆరోగ్య శాఖ