ETV Bharat / bharat

'కష్టాలు చెప్పుకున్న వారి గొంతు నొక్కేస్తారా?' - కొవిడ్​ సమస్యలపై పోస్టులు

ప్రస్తుత కొవిడ్​ సంక్షోభంలో సామాజిక మాధ్యమాల్లో సమస్యలపై పోస్ట్​ చేయటం, సాయం కోరటాన్ని తప్పుడు సమాచారం అనలేమని సుప్రీం కోర్టు పేర్కొంది. అలాంటి ట్వీట్లు, పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోరాదని కేంద్రం, రాష్ట్రాలు, డీజీపీలకు సూచించింది. చర్యలు తీసుకుంటే కోర్టు ధిక్కరణగా భావిస్తామని హెచ్చరించింది. మరోవైపు.. దిల్లీ ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. కరోనా కట్టడికి కేంద్రంతో సహకరించాలని స్పష్టం చేసింది.

Supreme court
సుప్రీం కోర్టు
author img

By

Published : Apr 30, 2021, 4:58 PM IST

దేశంలో రెండో దశ కొవిడ్​-19 ఉద్ధృతిని జాతీయ విపత్తుగా అభివర్ణించింది సుప్రీం కోర్టు. సామాజిక మాధ్యమాల్లో తమకు ఎదురవుతోన్న సమస్యలను పోస్ట్​ చేయటం, సాయం కోరడాన్ని అణచివేసే ప్రయత్నాలు సరికాదని కేంద్రంతో పాటు పోలీసు ఉన్నతాధికారులను హెచ్చరించింది. సామాజిక మాధ్యమాల ద్వారా సాయం కోరడాన్ని తప్పుడు సమాచారం అనలేమని, అలాంటి ట్వీట్లు, పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోరాదని స్పష్టం చేసింది. చర్యలు తీసుకుంటే.. కోర్టు ధిక్కరణగా భావించాల్సి వస్తుందని హెచ్చరించింది.

దేశంలో కరోనా పరిస్థితులను సుమోటోగా స్వీకరించి, విచారించింది జస్టిస్​ డీవై చంద్రచూడ్​ నేతృత్వంలోని ధర్మాసనం. ఆక్సిజన్​, పడకలు, వైద్యుల కొరత వంటి వాటిపై సోషల్​ మీడియాలో పోస్టులు పెడితే.. పుకార్లుగా పేర్కొంటూ చర్యలు తీసుకోవద్దని కేంద్రం, రాష్ట్రాలు, డీజీపీలకు సూచించింది.

"సమాచారం పంచుకోవటం సాఫీగా సాగాలి. ప్రజల మాటలను మేం వింటాం. సంక్షోభంలో ఉన్న ప్రజలు పోస్టులు పెట్టారని.. వారిపై చర్యలు తీసుకుంటే కోర్టు ధిక్కరణగా భావిస్తాం. "

- సుప్రీం ధర్మాసనం

సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తున్నారన్న కారణంతో జాతీయ భద్రత చట్టం కింద కొందరిపై ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం ఇటీవల చర్యలు చేపట్టిన నేపథ్యంలో కోర్టు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

జాతీయ విధానం అనుసరించాలి..

వైద్యులు, ఆరోగ్య కార్యకర్తల చికిత్స కోసం కూడా పడకలు దొరకనట్లు గమనించామని పేర్కొంది కోర్టు. గత 70 ఏళ్ల నుంచి ఏర్పాటు చేసిన ఆరోగ్య సౌకర్యాలు సరిపోవడం లేదని, పరిస్థితి భయంకరంగా ఉందని వ్యాఖ్యానించింది. కొవిడ్​ సంరక్షణ కేంద్రాలుగా మార్చేందుకు హాస్టళ్లు, దేవాలయాలు, చర్చీలు సహా ఇతర ప్రదేశాలు తెరుచుకోవచ్చని సూచించింది. పేద ప్రజలు టీకా కొనుగోలు చేసే పరిస్థితులు లేనందున జాతీయ టీకా పంపిణీ విధానాన్ని కేంద్రం అనుసరించాలని స్పష్టం చేసింది. అందరికీ ఉచితంగా టీకా ఇవ్వటంపై ఆలోచన చేయాలంది.

దేశంలో ప్రజారోగ్య వ్యవస్థ క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్న సుప్రీం కోర్టు.. అవసరమైతే పదవీ విరమణ పొందిన వైద్యులు, అధికారులను తిరిగి నియమించవచ్చని పేర్కొంది. ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలనేది ప్రైవేటు వ్యాక్సిన్ తయారీదారులకు అనుమతించొద్దని తెలిపింది.

దిల్లీ ప్రభుత్వంపై ఆగ్రహం..

దేశ రాజధానిలో కరోనా విజృంభణ నేపథ్యంలో కేజ్రీవాల్​ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీం కోర్టు. కరోనాపై ఎలాంటి రాజకీయాలు చేయొద్దని, కరోనా కట్టడికి కేంద్రంతో సహకరించాలని సూచించింది. ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రతి ఒక్కరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని గుర్తు చేసింది. కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి రాష్ట్రంలోని సమస్యలను తెలపాలని దిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించింది.

దేశంలో ఆక్సిజన్​ కొరత లేదని, సరఫరా వేగవంతం చేసినట్లు ధర్మాసనం ముందు పవర్​పాయింట్​ ప్రెజెంటేషన్ ఇచ్చింది కేంద్రం. దిల్లీ ప్రభుత్వం రవాణా సమస్యతో సరిపడా ఆక్సిజన్​ తీసుకోవటం లేదని పేర్కొంది.

ఇదీ చూడండి: మూడో దశ వ్యాక్సినేషన్​ కోసం 2.45 కోట్ల రిజిస్ట్రేషన్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.