కొవిడ్ ఆస్పత్రిలో తాగునీరు అందుబాటులో లేదని.. బాగా దాహంగా ఉందంటూ 30 ఏళ్ల కొవిడ్ రోగి ఒకరు వేడుకోవడం వైరల్‌గా మారింది. వెంటనే నీరు పంపాలంటూ ప్రాధేయపడిన ఆ మహిళ గురువారం సాయంత్రం మరణించారు. ఉత్తరాఖండ్‌లో హల్ద్వానీ జిల్లా సుశీలా తివారీ ఆస్పత్రిలో జరిగిన ఈ ఘటన కొవిడ్ ఆస్పత్రుల దుస్థితికి అద్దం పడుతోంది.
"నేను సుశీలా తివారీ ఆస్పత్రిలోని కొవిడ్ కేర్ వార్డ్‌లో ఉన్నాను. గత రాత్రి నుంచి ఇక్కడ మంచినీరు లేదు. వీలైనంత త్వరగా మాకు నీరు సమకూర్చండి ప్లీజ్. నాతోపాటు ఇక్కడ చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.''
-మరణించిన బాధితురాలు
ఈ సంఘటనతో సుశీలా తివారీ ఆస్పత్రి నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చిందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే అధికారులు దీనిని ఖండించారు. ఒక్కో రోగికి నాలుగు బాటిళ్ల నీటిని అందిస్తున్నట్లు అలోక్ ఉప్రేతి అనే అధికారి పేర్కొన్నారు. మహిళ ఆరోగ్య పరిస్థితి విషమించిన కారణంగానే మరణించిందని తెలిపారు.
ఇవీ చదవండి: కొవిడ్‌తో మరో ప్రముఖ నటుడు మృతి