కరోనా చికిత్సలో ఉపయోగించే ఔషధాలు, పరికరాలపై అన్ని రకాల పన్నులను మాఫీ చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బంగాల్ సీఎం మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. వైద్య మౌలిక వసతులను బలోపేతం చేయాలని, కరోనా రోగులకు ఆక్సిజన్, ఔషధాలు ఇతర పరికరాల సరఫరా కొనసాగేలా చూడాలని కోరారు.
"ఔషధాలు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, సిలిండర్లు, కంటైనర్లను విరాళంగా ఇచ్చేందుకు ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, కంపెనీలు ముందుకొస్తున్నాయి. వీటిపై విధిస్తున్న కస్టమ్స్ డ్యూటీ, జీఎస్టీని మినహాయించాలని చాలా మంది దాతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ రేట్ల విధానం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది కాబట్టి.. వీటిపై పన్నులను మాఫీ చేయాలని కోరుతున్నా."
-మమతా బెనర్జీ, బంగాల్ సీఎం
సుంకాలను మాఫీ చేయడం ద్వారా ఔషధాలు, పరికరాల సరఫరా ఎలాంటి అడ్డంకులు లేకుండా చేయొచ్చని మమత అన్నారు. కరోనాపై సమర్థంగా పోరాడేందుకు సహకారం అందించాలని కోరారు.
ఇదీ చదవండి: దిల్లీలో మరోవారం పాటు లాక్డౌన్ పొడిగింపు