కరోనా కేసులు భారీగా వెలుగు చూస్తున్న వేళ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు సోమవారం నుంచి రెండు వారాల పాటు పూర్తిస్థాయిలో లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. ఇప్పటికే కర్ఫ్యూ అమలులో ఉన్నా ఫలితం లేకపోవడం కారణంగా లాక్డౌన్ విధిస్తూ.. రెండు రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి.
కర్ణాటకలో మే 10 నుంచి 24 వరకు సంపూర్ణ లాక్డౌన్ అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు. లౌక్‌డౌన్ పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు అందిన నేపథ్యంలో శివమొగ్గ, కలబుర్గి ప్రాంతాల్లో ఆంక్షలు లెక్కచేయని వారి వాహనాలను అధికారులు సీజ్ చేస్తున్నారు.
అదే దారిలో తమిళనాడు..
తమిళనాడులో లాక్డౌన్ పూర్తి స్థాయిలో అమలు అవుతోంది. నేటి నుంచి ఈ నెల 24 వరకు లాక్డౌన్ కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు.
జమ్ముకశ్మీర్‌లో పొడిగింపు..
కరోనా కట్టిడి దిశగా జమ్ముకశ్మీర్‌లో లాడ్డౌన్ను ఈ నెల 17 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో శ్రీనగర్‌లోని వీధులు అన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
ఇదీ చూడండి: కర్ణాటకలో సంపూర్ణ లాక్డౌన్: యడియూరప్ప