ETV Bharat / bharat

కేంద్రం తీరుపై 'సీరం' మండిపాటు- కారణమదే

వ్యాక్సినేషన్​ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వ పనితీరుపై సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా(ఎస్​ఐఐ) తీవ్ర స్థాయిలో మండిపడింది. అందుబాటులో ఉన్న టీకా నిల్వల వివరాలు తెలియకుండానే.. 18 నుంచి 45 ఏళ్ల మధ్య వారికి కేంద్రం వ్యాక్సినేషన్​ ప్రారంభించిందని ఆ సంస్థ కార్యనిర్వహక డైరెక్టర్​ విమర్శించారు.

Vaccination, SII
వ్యాక్సినేషన్​, సీరమ్​ ఇన్​స్టిట్యూట్​
author img

By

Published : May 22, 2021, 7:03 AM IST

కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రారంభించిన తీరుపై సీరం ఇనిస్టిట్యూట్‌(ఎస్​ఐఐ) ఆఫ్‌ ఇండియా మండిపడింది. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌ స్టాకు వివరాలు పరిగణనలోకి తీసుకోకుండానే కేంద్రం వివిధ వయసుల వారికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చేపట్టిందని ఎస్​ఐఐ కార్యనిర్వహక డైరెక్టర్‌ సురేశ్‌ జాదవ్‌ విమర్శించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) మార్గదర్శకాలనూ పట్టించుకోలేదని ఆక్షేపించారు.

డబ్ల్యూహెచ్​ఓ మార్గదర్శకాల ఆధారంగా వివిధ వయసుల వారికి ప్రాధాన్యం ఇవ్వాల్సిందని జాదవ్​ అన్నారు. ప్రారంభంలో 45 ఏళ్లు పైబడిన 30 కోట్ల మంది కోసం.. 60 కోట్ల డోసులు అవసరం ఉండేవని తెలిపారు. అయితే.. లక్ష్యాన్ని చేరుకోకముందే కేంద్రం 18 నుంచి 45 ఏళ్ల మధ్య వారికి వ్యాక్సినేషన్‌ను ప్రారంభించిందని సురేశ్‌ జాదవ్‌ విమర్శించారు. తగినన్ని టీకా డోసులు అందుబాటులో లేవని తెలిసి కూడా.. కేంద్రం వీరికి వ్యాక్సినేషన్‌ చేపట్టిందని మండిపడ్డారు. ఇది మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం అని అన్నారు.

ఇదీ చదవండి: '2021 చివరికల్లా యువత మొత్తానికి టీకా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.