India Covid Cases: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. కొత్తగా 13,216 మంది వైరస్ బారినపడగా.. మరో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. 8,148 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.63 శాతానికి చేరింది. మృతుల సంఖ్య 1.21 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.16 శాతం వద్ద ఉంది.
- మొత్తం కరోనా కేసులు: 4,32,83,793
- మొత్తం మరణాలు: 5,24,840
- యాక్టివ్ కేసులు: 68,108
- కోలుకున్నవారి సంఖ్య: 4,26,90,845
Vaccination India: భారత్‌లో శుక్రవారం 14,99,824 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,96,00,42,768 కోట్లకు చేరింది. మరో 4,84,924 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా కేసులు పెరిగాయి. ఒక్కరోజే 495,865 మంది వైరస్ బారినపడ్డారు. మరో 1,079 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 54,30,32,268కు చేరింది. మరణాల సంఖ్య 6,339,375కు చేరింది. ఒక్కరోజే 481,775 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 518,694,841గా ఉంది.
- అమెరికాలో 81,733కేసులు వెలుగుచూశాయి. మరో 200 మందికిపైగా చనిపోయారు.
- తైవాన్‌లో మరో 55,261 కేసులు.. 154కుపైగా మరణాలు నమోదయ్యాయి.
- ఫ్రాన్స్‌లో 50,605 కేసుల బయటపడగా.. 43 మంది మరణించారు.
- ఇటలీ ఒక్కరోజే 35,427 మంది కొవిడ్ బారినపడ్డారు.
- ఆస్ట్రేలియాలో 30,187 కరోనా కేసులు, 52 మరణాలు నమోదయ్యాయి.
ఇదీ చూడండి : 'మహా'లో మరో 4వేల కేసులు.. మరణాలపై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన!