Covid Cases in India: కేరళలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. సోమవారం తగ్గినట్లు కనిపించిన కేసులు.. మంగళవారం రికార్డు స్థాయిలో వెలుగుచూశాయి. ఒక్కరోజే 55,475 మందికి వైరస్ సోకింది. కొవిడ్ ధాటికి మరో 70 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 52,141కు పెరిగింది. కాగా కొత్తగా 30,226 మంది వైరస్‌ను జయించారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 2,85,365కు చేరింది.
మహాలో మళ్లీ..
మహారాష్ట్రలో రోజువారీ కొవిడ్ కేసుల్లో పెరుగుదల నమోదైంది. కొత్తగా 33,914 మందికి కరోనా నిర్ధరణ అయింది. మరో 86 మంది మరణించారు. 30,500 మంది వైరస్‌ను నుంచి కోలుకున్నారు.
కన్నడ నాట తగ్గుదల..
కర్ణాటకలో రోజువారీ కొత్త కేసులు సోమవారంతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. మంగళవారం కొత్తగా 41,400 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. 52 మంది మృతి చెందారు. 53,093 మంది వైరస్‌ను జయించారు. ప్రస్తుతం 3.50 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తమిళనాడులో కొత్త కేసుల సంఖ్య తగ్గింది. తాజాగా 30,055 మందికి వైరస్ సోకింది. మరో 48 మంది మరణించారు. కొత్తగా 25,221 మంది కోలుకున్నారు.
దిల్లీలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. తాజాగా 6,028 కేసులు నమోదవగా.. 31 మంది చనిపోయారు. పాజిటివిటీ రేటు 10.55 శాతానికి చేరింది.
ముంబయి కొవిడ్ కేసులు గణనీయంగా తగ్గాయి. కొత్తగా 1,815 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 10 మంది మృతి చెందారు.
కరోనా ఉద్ధృతి అధికంగా ఉన్న మరిన్ని రాష్ట్రాలు..
రాష్ట్రం | కొత్త కేసులు | మరణాలు |
కేరళ | 55,475 | 70 |
కర్ణాటక | 41,400 | 52 |
మహారాష్ట్ర | 33,914 | 86 |
తమిళనాడు | 30,055 | 48 |
గుజరాత్ | 16,608 | 28 |
ఆంధ్రప్రదేశ్ | 13,819 | 12 |
ఉత్తర్‌ప్రదేశ్ | 11,159 | 17 |
జమ్ముకశ్మీర్ | 6,570 | 14 |
దిల్లీ | 6,028 | 31 |
ఒడిశా | 5,891 | 07 |
దిల్లీ | 5,760 | 30 |
తెలంగాణ | 4,559 | 02 |
బంగాల్ | 4,546 | 37 |
పుదుచ్చేరి | 19,11 | 04 |
ఇదీ చూడండి: Leopard Attack: చిరుత బీభత్సం- రైతులు, అటవీ సిబ్బందిపై దాడి