ETV Bharat / bharat

కేరళలో 10వేల దిగువకు కేసులు.. బంగాల్​లో స్కూళ్లు ఓపెన్ - తమిళనాడు కరోనా కేసులు

Covid Cases In India: కేరళలో రోజూవారీ కరోనా కేసులు 10వేల దిగువకు పడిపోయాయి. కొత్తగా 8,989 మందికి వైరస్ నిర్ధరణ అయింది. కొవిడ్ కేసులు తగ్గడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లను తెరవాలని బంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది.

Covid Cases In India
దేశంలో కరోనా కేసులు
author img

By

Published : Feb 14, 2022, 9:54 PM IST

Covid Cases In India: కేరళలో కొవిడ్​-19 కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా 8,989 మందికి వైరస్ నిర్ధరణ అయింది. వైరస్​తో మరో 178 మంది మృతి చెందారు. అటు కర్ణాటకలోనూ కేసులు తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 1,568 మందికి వైరస్ సోకింది. మహమ్మారి కారణంగా మరో 25మంది ప్రాణాలు కోల్పోయారు. దిల్లీలో తాజాగా 586 కేసులు నమోదు అయ్యాయి. పాజిటివిటీ రేటు ప్రస్తుతం 1.37గా ఉంది.

పాఠశాలలు తెరవాలని నిర్ణయం..

రాష్ట్రంలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నందున బంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని స్కూళ్లను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 16 నుంచి పాఠశాలలు తెరవాలని ఆదేశించింది.

అంతర్జాతీయ విమానాలకు గ్రీన్​సిగ్నల్

కరోనా కారణంగా అంతర్జాతీయ విమానాల రాకపోకలపై విధించిన నిషేధాన్ని బంగాల్​ ప్రభుత్వం ఎత్తివేసింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఆర్​టీపీసీఆర్ టెస్టు చేయించుకోవాలని లేదా వ్యాక్సినేషన్​ ధ్రువపత్రం తీసుకురావాలని ఆదేశించింది.

హిమాచల్​లో స్కూళ్లు ఓపెన్..

హిమాచల్ ప్రదేశ్​లో కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్న క్రమంలో పాఠశాలలు, జిమ్​లు, సినిమా హాళ్లను తిరిగి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఫిబ్రవరి 17 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని ఆదేశించింది.

ఇతర రాష్ట్రాల్లో కేసులు ఇలా..

రాష్ట్రంకేసులుమరణాలు
మధ్యప్రదేశ్1,76004
మహారాష్ట్ర2,00012
రాజస్థాన్​1,10206
గుజరాత్ 1,04014
మేఘాలయ2501
జమ్ముకశ్మీర్​​ 2450
లద్ధాఖ్ 770

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.