ETV Bharat / bharat

కర్ణాటకలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. మహారాష్ట్రలో తగ్గుముఖం

Covid Cases in India: కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. కర్ణాటకలో కొత్తగా 32,793 కేసులు నమోదయ్యాయి. దిల్లీ, తమిళనాడు, బంగాల్​, ఉత్తర్​ప్రదేశ్​, కేరళలో ఆందోళనకర స్థాయిలో కేసులు వెలుగుచూశాయి. మరోవైపు మహారాష్ట్ర కొవిడ్​ కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 42,462 మందికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు.

కర్ణాటక
కర్ణాటకలో 32వేలకుపైగా కరోనా కేసులు
author img

By

Published : Jan 15, 2022, 8:46 PM IST

Updated : Jan 15, 2022, 10:54 PM IST

Covid Cases in India: దేశంలో కరోనా శరవేగంగా విస్తరిస్తోంది. కొవిడ్​ హాట్​స్పాట్​ అయిన మహారాష్ట్రలో కొత్తగా 42,462 కేసులు నమోదయ్యాయి. అయితే రాష్ట్రంలో గత రెండు రోజులతో పోలిస్తే కేసులు తగ్గుముఖం పట్టాయి. మరోవైపు కొత్తగా 125 ఒమిక్రాన్​ కేసులు నచ్చాయి.

కర్ణాటకలో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. కొత్తగా 32వేల మందికిపైగా వైరస్​ సోకినట్లు నిర్ధరణ అయింది. ఒక్క బెంగళూరులోనే 22,284 కేసులు బయటపడ్డాయి. ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. 4273 మంది కోలుకున్నారు. యాక్టివ్​ కేసుల సంఖ్య 1,69,850గా ఉంది.

ప్రాంతంకొత్త కేసులుమరణాలు
మహారాష్ట్ర 42,462 23
కర్ణాటక 32,793 7
దిల్లీ 20,718 30
తమిళనాడు 23,989 11
బంగాల్​ 19,064 39
ఉత్తర్​ప్రదేశ్​ 15,795 4
కేరళ 17,755 17
ఒడిశా 10,856 2
ముంబయి 10,661 11
మధ్యప్రదేశ్​ 5,315 -
ఆంధ్రప్రదేశ్​ 4,955 1
జమ్ముకశ్మీర్​ 3,251 4
తెలంగాణ 1,963 2
చండీగఢ్​ 1,795 -

ఒమిక్రాన్​ కేసులు

కరోనా తీవ్రంగా ఉన్న కేరళలో కొత్తగా 48 ఒమిక్రాన్​ కేసులు వెలుగుచూశాయి. రాష్ట్రంలో ఒమిక్రాన్​ కేసుల సంఖ్య 528కు చేరింది. మరోవైపు ఒడిశాలో కొత్తగా 32 ఒమిక్రాన్​ కేసులు నమోదయ్యాయి. దీంతో ఒడిశాలో మొత్తం ఒమిక్రాన్​ కేసుల సంఖ్య 202కు చేరింది. అత్యధికంగా మహారాష్ట్రలో 125 ఒమిక్రాన్​ కేసులు బయటపడ్డాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్​ కేసుల సంఖ్య 1,730కు పెరిగింది.

భారత్​లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఒక్కరోజే.. 2,68,833 కేసులు నమోదయ్యాయి. వైరస్​తో మరో 402 మంది మరణించారు. 1,22,684 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. కరోనా​ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 16.66 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

దేశంలో ఒమిక్రాన్​ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 28 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 6,041కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

భారత్​లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. శుక్రవారం ఒక్కరోజే 58,02,976 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,56,02,51,117కు చేరింది.

ఇదీ చూడండి : వ్యాక్సినేషన్‌లో దూసుకెళ్తున్న దేశాలు.. భారత్ ఎన్నో స్థానమంటే?

Last Updated : Jan 15, 2022, 10:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.