Covid Cases In India: దేశంలో కరోనా కేసుల సంఖ్య మరోసారి వెయ్యి దాటింది. కొత్తగా 1,150 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,30,42,097కు చేరింది. వైరస్ ధాటికి నలుగురు మృతిచెందగా.. 954 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.76 శాతంగా నమోదైంది. యాక్టివ్ కేసులు 11,366గా ఉన్నాయి.
- యాక్టివ్ కేసులు: 11,558
- మరణాలు: 5,21,751
- మొత్తం కేసులు: 4,30,42,097
- రికవరీలు: 4,25,08,788
Vaccination in India: దేశంలో కరోనా టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. 12,56,533 మందికి శనివారం టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,86,51,53,593కు చేరింది. కొత్తగా 3,65,118 కరోనా టెస్టులు నిర్వహించారు. ఇప్పటివరకు మొత్తం 83,18,43,406 కరోనా పరీక్షలు చేశారు. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా 5,56,924 కొత్త కేసులు నమోదయ్యాయి. మహమ్మారి ధాటికి 1,593 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ కొరియా, జర్మనీ, ఆస్ట్రేలియా, ఇటలీ, ఫ్రాన్స్ దేశాల్లో కొవిడ్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది.
- దక్షిణ కొరియాలో తాజాగా 1,07,882 కరోనా కేసులు నమోదయ్యాయి. 273 మంది ప్రాణాలు కోల్పోయారు.
- జర్మనీలో 46,073 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. 109 మంది మృతిచెందారు.
- ఫ్రాన్స్‌లో తాజాగా 1,11,583 మంది వైరస్ సోకింది. మరో 61 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఆస్ట్రేలియాలో 41,209 కరోనా కేసులు బయటపడ్డాయి. 35 మంది వైరస్‌కు బలయ్యారు.
- ఇటలీలో 63,815 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 133 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి : 'ఒక్కరికి కరోనా సోకినా స్కూల్ మొత్తం మూసేయాల్సిందే!'