ETV Bharat / bharat

అప్పుడే గరిష్ఠస్థాయికి మూడోదశ- రాష్ట్రాలు సన్నద్ధం! - మూడోదశపై ఐఐటీ కాన్పూర్ పరిశోధన

సెప్టెంబర్‌-అక్టోబర్‌ మధ్యకాలంలో థర్డ్‌వేవ్‌ గరిష్ఠానికి చేరుకునే అవకాశాలున్నట్లు ఐఐటీ కాన్పుర్‌ నిపుణులు అంచనా వేశారు. సెకండ్​ వేవ్​తో పోల్చితే థర్డ్​వేవ్​లో వైరస్​ ప్రభావం ఎక్కువగా ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. మరోవైపు మూడోదశను ఎదుర్కొనేందుకు అనేక రాష్ట్రాల నిపుణులు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది.

third wave peak
కరోనా మూడోదశ
author img

By

Published : Jun 22, 2021, 8:11 AM IST

దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే, రానున్న రోజుల్లో కరోనా థర్డ్‌వేవ్‌ అనివార్యమని నిపుణులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌-అక్టోబర్‌ మధ్యకాలంలో థర్డ్‌వేవ్‌ గరిష్ఠానికి చేరుకునే అవకాశాలున్నట్లు ఐఐటీ కాన్పూర్‌ నిపుణులు అంచనా వేశారు.

'అటు విధాన రూపకర్తలకు ఇటు సామాన్య ప్రజలకు కరోనా వైరస్‌ థర్డ్‌వేవ్‌పై ఆందోళన మొదలయ్యింది. ఈ నేపథ్యంలో సెకండ్‌ వేవ్‌ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ఎస్​ఐఆర్​ మోడల్‌ ఆధారంగా థర్డ్‌వేవ్‌ను అంచనా వేశాం' అని ఐఐటీ కాన్పూర్‌ ప్రొఫెసర్‌ రాజేష్‌ రంజన్‌ పేర్కొన్నారు. జులై 15వరకు దేశవ్యాప్తంగా మొత్తం అన్‌లాక్‌ ప్రక్రియ జరిగితే.. థర్డ్‌వేవ్ గరిష్ఠతను తాకే సంభావ్యతను మూడు విభాగాల్లో అంచనా వేశామని చెప్పారు.

1. తిరిగి యథాస్థితికి రావడం (Back to Normal): థర్డ్‌వేవ్‌ అక్టోబర్‌లో గరిష్ఠానికి చేరుకుంటుంది. కానీ, సెకండ్‌ వేవ్‌తో పోలిస్తే తీవ్రత తక్కువగానే ఉంటుంది.

2. వైరస్ ఉత్పరివర్తనాల ప్రభావం తక్కువే (Normal With Virus Mutations): సెకండ్‌ వేవ్‌లో గరిష్ఠం కన్నా ఎక్కువగా ఉంటే అది సెప్టెంబర్‌ నాటికే కనిపించవచ్చు.

3. నిబంధనలు పాటిస్తేనే ప్రభావం తగ్గుంది (Stricter Interventions): ఒకవేళ భౌతిక దూరం, కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తే కొవిడ్‌ గరిష్ఠ స్థాయిని అక్టోబర్‌ చివరకు ఆలస్యం చేయవచ్చు. అయినప్పటికీ సెకండ్‌ వేవ్‌తో పోలిస్తే ఈ గరిష్ఠ తీవ్రత తక్కువగా ఉంటుందని ఐఐటీ కాన్పూర్‌ అధ్యయనం అంచనా వేసింది.

కొన్ని ఈశాన్య రాష్ట్రాలు (మిజోరాం, మణిపూర్‌, సిక్కిం రాష్ట్రాలు) మినహా దేశంలో సెకండ్‌ వేవ్‌ పూర్తిగా క్షీణించిపోయిందని తాజా అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్‌ రాజేష్‌ రంజన్‌, మహేంద్ర వర్మతో పాటు ఆయన బృందం స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో కేరళ, గోవా, సిక్కిం, మేఘాలయా రాష్ట్రాల్లో కొవిడ్‌ పాజిటివిటీ రేటు 10శాతానికి ఎగువన ఉండగా.. చాలా రాష్ట్రాల్లో మాత్రం ఇది 5శాతం కంటే తక్కువగానే ఉందని పేర్కొంది. అయితే, ఈ మోడల్‌లో కరోనా వ్యాక్సినేషన్‌ను పరిగణలోకి తీసుకోలేదని.. ఒకవేళ అలా తీసుకుంటే గరిష్ఠ స్థాయి తీవ్రత తగ్గుతుందని ఐఐటీ నిపుణులు పేర్కొన్నారు. వీటికి సంబంధించిన మరో అధ్యయన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.

మూడో దశను ఎదుర్కొనేందుకు భారత్​ సిద్ధం..

భారత్​ కరోనా మూడోదశను ఎదుర్కొనేందుకు ఎక్కువ సమయం లేదని ఎయిమ్స్​ డైరెక్టర్​​ రణదీప్​ గులేరియా అన్నారు. రాబోయే ఆరు నుంచి ఎనిమిది వారాల్లో మూడోదశ రావడం అనివార్యం అని హెచ్చరిచారు. ఈ నేపథ్యంలో వైద్యనిపుణులు దేశవ్యాప్తంగా అప్రమత్తంగా ఉన్నారు.

రాష్ట్రాలు సిద్ధం..

ఇప్పటికే పలు రాష్ట్రాల్లో భవిష్యత్తు అవసరాలను తీర్చేవిధంగా ప్రత్యేక ఆస్పత్రుల నిర్మాణం, పెద్ద సంఖ్యలో పడకలను ఏర్పాటు చేస్తున్నారు.

  • ముంబయి తూర్పు శివారు ప్రాంతం గోరేగావ్‌లోని నెస్కో జంబో కొవిడ్ కేర్ సెంటర్‌లో 700 పడకలు అందుబాటులోకి రానున్నట్లు ఆ రాష్ట్ర సర్కార్​ తెలిపింది.
  • తమిళనాడులో రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రి, స్టాన్లీ మెడికల్ కాలేజ్, కిల్పాక్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రుల్లో పిల్లల వార్డులను విస్తరించడంతో పాటు వారి కోసం 250 పడకల ప్రత్యేక వార్డును ప్రారంభించనున్నారు.
  • అన్ని జిల్లా ఆస్పత్రుల్లో 70-80 పడకల పీడియాట్రిక్స్ వార్డును ఏర్పాటు చేస్తున్నట్లు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారు.
  • గుజరాత్​లో 14 మంది పీడియోట్రిక్​ నిపుణులను గుర్తించి.. మూడోదశను ఎదుర్కొనేందుకు వారికి శిక్షణ కూడా ఇస్తోంది.
  • దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. మూడోదశను ఎదుర్కొనేందుకు సరిపడా పడకలను, ఆక్సిజన్​ సిలిండర్​లను సిద్ధం చేయాలని ఆదేశించారు.

ఇదీ చూడండి: 'టీకా పంపిణీ ప్రక్రియకు వెన్నెముక కొవిన్!​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.