ETV Bharat / bharat

'దేశ ప్రజలందరికీ కేంద్రం ఉచిత టీకా ఇవ్వాలి' - కరోనాను కట్టడి చేయడంలో రాష్ట్రప్రభుత్వం విఫలం

కేంద్ర ప్రభుత్వం ప్రజలందరికీ ఉచితంగా టీకా ఇవ్వాలని డిమాండ్​ చేశారు డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్​. కరోనా వైరస్​ మొదటి నుంచి రెండో దశ మధ్యలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. దాని ఫలితంగా నేడు కేసులు పెద్ద సంఖ్యలో వెలుగు చూస్తున్నాయని తెలిపారు.

Stalin, vaccines free for all
'దేశ ప్రజలందరికీ కేంద్రం ఉచిత టీకా ఇవ్వాలి'
author img

By

Published : Apr 28, 2021, 11:14 PM IST

కరోనా వైరస్​ను కట్టడి చేయడానికి మొదటి, రెండో దశల మధ్య చేపట్టాల్సిన తగు జాగ్రత్తలను కేంద్రం, తమిళనాడు ప్రభుత్వాలు తీసుకోలేదని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్​ ఆరోపించారు. ఈ కారణంగానే కొత్త కేసులు భారీగా వెలుగు చూస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ దేశంలోని ప్రజలందరకీ ఉచితంగా టీకా ఇస్తున్నట్లు తక్షమే ప్రకటించి, అమలు చేయాలని డిమాండ్​ చేశారు.

ఉత్తరాది రాష్ట్రాల నుంచి వస్తున్న సమాచారం దక్షిణాది ప్రజలను భయపెట్టిస్తోందన్న ఆయన.. ప్రజలను కాపాడేందుకు కేంద్రం తగు జాగ్రత్తలు చేపట్టాలని కోరారు. ఆసుపత్రుల్లో బెడ్లు, ఔషధాలు, ఆక్సిజన్​, వ్యాక్సిన్​ల కొరత ఎక్కువగా ఉందని వార్త పత్రికల నివేదికలు చెప్తున్నాయని ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు.

మొదటి దశ అప్పుడు చేసిన తప్పుల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి గుణపాఠాలు నేర్చుకోలేదన్న ఆయన.. రెండో దశలో కూడా అలాంటి పొరపాట్లే చేస్తున్నాయని విమర్శించారు. దాని ఫలితాన్ని ఇప్పుడు మనమందరం అనుభవిస్తున్ననామని చెప్పారు.

ఇదీ చూడండి: 'టీకా ధరలను నియంత్రించడంలో మోదీ సర్కార్​ విఫలం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.