దేశంలో మరో 50వేల 357 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. కరోనా కారణంగా మరో 577 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం మరణాల సంఖ్య 1.25 లక్షలకు ఎగబాకింది.
దేశవ్యాప్తంగా శుక్రవారం ఒక్కరోజే 11,13,209 నమూనాలను పరీక్షించినట్టు భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) వెల్లడించింది. ఫలితంగా మొత్తం టెస్ట్‌ల సంఖ్య 11కోట్ల 65లక్షలు దాటింది.
మరింత మెరుగైన రికవరీ రేటు
దేశంలో ఐదు వారాలుగా కొత్త కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్యే అధికంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశవ్యాప్త రికవరీ రేటు 92.41 శాతానికి పెరిగింది. మరణాల రేటు 1.48 శాతానికి తగ్గినట్టు ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి.
ఇవీ చదవండి: