దేశంలో కరోనా వాక్సిన్ పంపిణీ ప్రకియ వేగంగా కొనసాగుతోంది. బుధవారం నాటికి వ్యాక్సినేషన్ 12వ రోజుకు చేరింది. సాయంత్రం 6 గంటల వరకు మొత్తంగా 23 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు టీకా వేసినట్లు కేంద్రఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. కాగా బుధవారం ఒక్కరోజే 6 గంటల వరకు 2,99,299 మంది ఆరోగ్య కార్యకర్తలు టీకా తీసుకున్నట్లు ప్రకటించింది.
వాక్సిన్ వల్ల మరణాలు నమోదుకాలేదని, ఎవరికీ ఎలాంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తలేదని పేర్కొంది. 24 గంటల క్రితం టీకా తీసుకున్న ఒడిషాకు చెందిన 23 ఏళ్ల యువకుడు మృతి చెందాడని తెలిపింది. కాగా శవపరీక్ష తరువాత అతని మరణానికి గల కారణాన్ని వెల్లడిస్తామని పేర్కొంది. బుధవారం సాయత్రం నాటికి 41, 599 టీకా సెషన్లు జరిగాయని పేర్కొంది.
ఇదీ చూడండి: దిల్లీ హింసతో రైతు ఉద్యమంలో చీలిక!