ETV Bharat / bharat

కరోనాతో.. రక్తం గడ్డకట్టే ప్రమాదమూ ఎక్కువే! - ఊపిరితిత్తులు కరోనా వైరస్​

కరోనాతో రక్తం గడ్డకట్టే ప్రమాదం ఎక్కువ అని నిపుణులు వెల్లడించారు. దీని వల్ల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు. ఇలాంటి కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయని చెప్పారు. ఇంత కాలం కరోనా ఉపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి అనే అనుకున్నారని.. కానీ అంతకుమించి రక్తం గడ్డ కట్టే ప్రమాదం కూడా అధికమని పేర్కొన్నారు.

COVID-19 not just lung disease, can also cause dangerous blood clots: experts
కరోనాతో రక్తం గడ్డకట్టే ప్రమాదమూ ఎక్కువే!
author img

By

Published : May 7, 2021, 8:17 PM IST

యావత్​ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా గురించి రోజుకో విషయం బయటకు వస్తోంది. తాజాగా.. కొవిడ్​ గురించి నిపుణులు చెబుతున్నది మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇన్ని రోజులు.. కరోనా అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి అని అనుకున్నారు. కానీ దాని వల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదం కూడా ఉందని, ఇందుకు సంబంధించి ఆధారాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. కొన్ని సందర్భాల్లో.. అవయవాలను తీసేసే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు.

ఆసుపత్రుల పాలైన కరోనా రోగుల్లో డీవీటీ(డీప్​ వెయిన్​ థ్రోంబోసిస్​) 14-28శాతం ఉందని ప్రపంచవ్యాప్తంగా చేసిన ఆధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ డీవీటీని రక్తం గడ్డకట్టడంగా పరిగణిస్తారు.

భారత్​లో కూడా ఇలాంటి కేసులున్నాయని నిపుణులు పేర్కొన్నారు. కరోనా ఊపిరితిత్తులకు ఎంత సంబంధించిందో.. రక్తం గడ్డకట్టడానికి అంతే సంబంధించిన వ్యాధి అని చెబుతున్నారు.

ఇదీ చదవండి : కొవిడ్‌ విజేతలపై 'బ్లాక్‌ ఫంగస్‌' పంజా..!

"ఇలా రక్తం గడ్డకట్టిన కేసులను మేము వారానికి సగటున 5-6 చూస్తున్నాము. టైప్​-2 డయాబెటిస్​ మెల్లిటస్​ ఉన్నా కరోనా రోగులలో రక్తం గడ్డకట్టే ప్రమాదం ఎక్కువ. కానీ ఇలా ఎందుకు జరుగుతుందో చెప్పడానికి కచ్చితమైన ఆధారాలు లేవు" అని దిల్లీలోని సర్​ గంగా రామ్​ ఆసుపత్రిలో వాస్క్యులర్​ అండ్​ ఎండోవాస్క్యులర్​ సర్జన్​ డా.అంబరిష్​ సాత్విక్​ వెల్లడించారు.

కరోనా రోగుల్లో రక్త నాళాలను అడ్డుకునే విధంగా రక్తం గడ్డకట్టే ప్రమాదం పెరుగుతున్నట్టు గతేడాది నవంబర్​లో లాన్సెట్​ ఓ అధ్యయనాన్ని ప్రచురించింది. దీని వల్ల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఎక్కువే ఉందని పేర్కొంది.

సాధారణ పరిస్థితుల్లో కన్నా.. కరోనా అనంతరం అరుదుగా జరిగే రక్తం గడ్డకట్టడం వంటి ప్రమాదాలు 100రెట్లు ఎక్కువగా ఉన్నాయని ఆక్స్​ఫర్డ్​ యూనివర్సిటీ కూడా ఏప్రిల్​ నెలలో ఓ అధ్యయనాన్ని ప్రచురించింది.

ఇదీ చూడండి:- డీఆర్​డీఓ కొత్త టూల్​తో సెకన్లలోనే కరోనా టెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.