దేశంలో కొవిడ్ ఉద్ధృతి(Covid-19 cases) క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 62,224 మంది వైరస్ బారినపడ్డారు. మహమ్మారి ధాటికి మరో 2542 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజే 1,07,628 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 95.80 శాతానికి చేరిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
- మొత్తం కేసులు: 29,633,105
- మొత్తం మరణాలు: 3,79,573
- కోలుకున్నవారు: 2,83,88,100
- యాక్టివ్ కేసులు: 8,65,432
దేశవ్యాప్తంగా టీకా పంపిణీ వేగంగా సాగుతున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మంగళవారం 28,00,458 టీకా డోసులు అందించగా.. మొత్తం 26,19,72,014 డోసులు పంపిణీ చేసినట్లు తెలిపింది. తాజాగా 19,30,987 పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది.
ఏ దేశంలో నమోదవ్వని విధంగా..
కరోనా మహమ్మారి కర్కశత్వానికి ఈ ఏడాది మే నెలలో భారత్‌లో రోజుకు వేల సంఖ్యలో రోగులు కన్నుమూశారు. ప్రపంచంలోని ఏ దేశంలో నమోదవ్వని విధంగా భారత్‌లో రికార్డు స్థాయిలో కొవిడ్ కేసులు, మరణాలు నమోదయ్యాయి. దేశంలో గంటకు సగటున 165 మందిని కరోనా పొట్టన పెట్టుకుంది. మే నెలలో దేశంలో రికార్డు స్థాయిలో 90 లక్షల 30 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలోని ఏ దేశంలోనూ ఒక నెలలో ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదవ్వలేదు. ఏప్రిల్ నెలలో దేశంలో 69.4 లక్షల మంది కరోనా బారినపడగా దానికంటే 30 శాతం అధికంగా మేలో కేసులు వెలుగుచూశాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చూడండి: కొవిడ్ బాధితుల్లో రక్తం గడ్డకట్టడానికి కారణమిదే.. !
అక్కడ 6 లక్షలు దాటిన కరోనా మరణాలు