Family Suicide In Kushaiguda: ఏదైనా సమస్య వస్తే పరిష్కరించాల్సి పోయి.. చావే పరిష్కారమని అనుకుంటున్నారు. తెలంగాణలో స్కూల్‌కు వెళ్లే బాలుడు నుంచి.. వృద్ధుల వరకు చావే శరణ్యమని భావిస్తున్నారు. సమస్యకు సొల్యూషన్ వెతకాల్సింది పోయి.. సూసైడ్ ఒక్కటే మార్గం అన్నట్లుగా మారిపోయింది. ఏమైందో తెలియదు ఓ ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
Couple With Two Children Suicide In Kushaiguda: హైదరాబాద్ కుషాయిగూడ పరిధి కందిగూడలో విషాదం చోటుచేసుకుంది. కందిగూడలో ఇద్దరు పిల్లలతో సహా దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దంపతులు సతీశ్, వేద. అయితే వీరికి నిషికేత్ 9 సంవత్సరాలు, నిహాల్ 5 సంవత్సరాలు వయసు గల పిల్లలు ఉన్నారు. అయితే పిల్లల అనారోగ్యం బారిన పడ్డారని తెలుస్తోంది. పెద్ద కుమారుడు నిషికేత్ మానసిక వికలాంగుడు కాగా.. చిన్న కుమారుడు నిహాల్ చెవి సమస్యతో బాధ పడుతున్నట్లు సమాచారం. ఇది భరించలేని తల్లిదండ్రులు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్నారు.
ఘటనా స్థలానికి చేరుకున్న కుషాయి గూడ పోలీసులు.. అక్కడి స్థలాన్ని పరిశీలించారు. నలుగురు సైనెడ్ మింగినట్లు భావిస్తున్నారు. సతీశ్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా గుర్తించారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తదుపరి విచారణ చేపట్టారు. ఈ కేసుపై వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇక కందిగూడలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిన్న మొన్నటి వరకు ఆనందంగా గడిపిన ఫ్యామిలీ ఉన్నట్టుండి ఆత్మహత్యకు పాల్పడటం స్థానికులను కలవరపెడుతోంది. అక్కడి ప్రాంత వాసులను ఈ ఘటన ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. ఇక బంధువులు ఈ విషయం తెలుసుకుని కందిగూడకు చేరుకున్నారు. ఏం జరిగిందో తమకు తెలియదని బోరున విలపిస్తున్నారు. ఇక సతీశ్, వేద కుటుంబాలు తీవ్ర విషాదంలోకి వెళ్లాయి. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
అయితే ఇంటి పెద్దతో సహా ఇలా చేయడంపై స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఏదైనా సమస్య ఉంటే.. పరిష్కార మార్గం వెతకాలి కానీ.. ఇలా పిల్లలతో కలిసి చనిపోవడం ఏంటని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. కొంత మంది పిల్లల ఆరోగ్యం బాగలేదు కాబట్టి.. తాము బతికి దండగా అని భావించి చనిపోయినట్లు వాపోతున్నారు. పిల్లలు లేని జీవితం ఎందుకు అనుకున్నారని.. వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా.. ఇలా ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్యకు పాల్పడటం.. అక్కడి వాసులను ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది.
ఇవీ చూడండి: