ETV Bharat / bharat

దివ్యాంగుడిపై దాడి.. కర్రలతో విచక్షణా రహితంగా... - Divyang thrashed in Delhi

కనికరం లేకుండా దివ్యాంగుడిపై కర్రలతో దాడి చేశారు ఇద్దరు వ్యక్తులు. భార్య, భర్త కలిసి దివ్యాంగుడిపై విరుచుకుపడ్డారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

couple beat up
couple beat up
author img

By

Published : Mar 30, 2022, 7:59 AM IST

దివ్యాంగుడిపై విచక్షణా రహితంగా దాడి చేశారు ఇద్దరు వ్యక్తులు. పెద్దపెద్ద కర్రలతో తన వాహనంపై ఉన్న సమయంలోనే దారుణంగా కొట్టారు. స్థానికులు ఈ ఘటనను వీడియో తీయగా.. విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరూ భార్యాభర్తలని పోలీసులు తెలిపారు.

couple beat up
దివ్యాంగుడిపై దాడి చేస్తున్న దంపతులు
couple beat up
.

గ్రేటర్ నోయిడాలోని జెవార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. గజేంద్ర అనే దివ్యాంగుడికి.. జుగాండ్ అనే వ్యక్తి బంధువు అవుతాడు. ఓ పాఠశాలను నడిపే బాధ్యతను గజేంద్రకు జుగాండ్ అప్పగించాడు. కరోనా సమయంలో పాఠశాలలు మూతపడటం వల్ల.. ఆ భవనాన్ని అద్దెకు ఇచ్చాడు గజేంద్ర. ఈ విషయంపైనే ఇరువురి మధ్య వివాదం చెలరేగింది. దీంతో గజేంద్రపై దాడి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్టు గ్రేటర్ నోయిడా డీసీపీ విశాల్ పాండే తెలిపారు. దాడి చేసిన ఇద్దరినీ అరెస్టు చేసినట్లు చెప్పారు.

couple beat up
.

ఇదీ చదవండి: 1824లోనే ఆంగ్లేయులపై భారతీయుల తిరుగుబాటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.