ETV Bharat / bharat

'దేశానికి ఆక్సిజన్ అవసరం​.. ప్రధానికి ఇల్లు కాదు'

దేశానికి కావాల్సింది ఆక్సిజన్​ అని, ప్రధాన మంత్రికి ఇల్లు కాదని కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్​(సెంట్రల్​ విస్టా) శుద్ధ దండగ అని అన్నారు.

Rahul Gandhi
రాహుల్ గాంధీ
author img

By

Published : May 9, 2021, 7:44 PM IST

ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్​ సెంట్రల్​ విస్టాపై కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. "దేశానికి కావలసింది ఆక్సిజన్​.. ప్రధాన మంత్రికి ఇల్లు కాదు" అని అన్నారు. 'సెంట్రల్​ విస్టా' క్రిమినల్​ వేస్టేజ్​(కొత్త పార్లమెంట్​ శుద్ధ దండగ) అని ట్విట్టర్ వేదికగా విమర్శించారు.

ఆక్సిజన్​ సిలిండర్​ల కోసం కొందరు నిలబడి ఉన్న ఫొటోను, సెంట్రల్​ విస్టా ప్రాజెక్టు నిర్మాణ పనుల ఫొటోను ట్విట్టర్​లో రాహుల్​ గాంధీ పోస్టు చేశారు.

పాత పార్లమెంట్ కాలపరిమితి తీరుతున్నందు వల్ల కొత్త పార్లమెంట్​(సెంట్రల్​ విస్టా)ను కేంద్రం నిర్మిస్తోంది. అందులో పార్లమెంట్​, సచివాలయం, ఉపరాష్ట్రపతి నివాసంతో పాటు ప్రధాన మంత్రి ఉండడానికి ఇల్లు నిర్మిస్తారు. ఆ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.

ఇదీ చదవండి: బంగాల్​లో అసలు ఆట ఇప్పుడే మొదలైందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.