ETV Bharat / bharat

పంజాబ్​ పుర పోరులో కాంగ్రెస్ క్లీన్​స్వీప్​! - పంజాబ్ మున్సిపల్ ఎన్నికలు

పంజాబ్​లో అధికార కాంగ్రెస్.. 7 మున్సిపల్ కార్పొరేషన్లను కైవసం చేసుకుంది. మరొక స్థానంలో నేడు రీపొలింగ్​ జరగ్గా.. ఫలితం గురువారం వెలువడనుంది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్​ రైతులు ఆందోళన సాగిస్తున్న వేళ.. అక్కడ భాజపాకు పెద్ద ఎదురు దెబ్బే తగిలినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Congress holds major lead in urban local bodies polls
పంజాబ్​ మున్సిపల్​ ఎన్నికల్లో కాంగ్రెస్ ముందంజ
author img

By

Published : Feb 17, 2021, 2:10 PM IST

Updated : Feb 17, 2021, 5:32 PM IST

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో పంజాబ్‌ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన సాగిస్తున్న వేళ.. ఆ రాష్ట్రంలో భాజపాకు గట్టి షాక్‌ తగిలింది. అక్కడి పురపాలక ఎన్నికల్లో కమలదళం ఓటమి చవిచూసింది. మొత్తం 8 మున్సిపల్‌ కార్పొరేషన్లలో 7 చోట్ల కాంగ్రెస్‌ నెగ్గింది. మరోచోట ఫలితం గురువారం వెలువడనుంది. అయితే ఈ ఫలితాల్లో భాజపా రెండో స్థానంలోనూ నిలవలేకపోయింది. శిరోమణి అకాలీదళ్​ కాస్త ప్రభావం చూపింది.

మోగా, హోశియార్​పుర్​, కపూర్​థలా, అబోహర్​, బటాలా, పఠాన్​కోట్​, బఠిండా కార్పొరేషన్లలో అధికార పార్టీ జయకేతనం ఎగురవేసింది. 116 నగర పంచాయతీల్లోనూ అధిక స్థానాల్లో గెలుపొంది తన పట్టు నిరూపించుకుంది కాంగ్రెస్​.

53 ఏళ్లకు..

బఠిండా మున్సిపల్‌ కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌ పార్టీ చరిత్ర సృష్టించింది. 53ఏళ్లలో తొలిసారిగా ఇక్కడ మేయర్‌ పదవిని దక్కించుకుంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఈ కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌కు 43 స్థానాలు రాగా.. శిరోమణి అకాలీదళ్‌ 7 చోట్ల గెలుపొందింది. దీంతో మేయర్‌ పదవి హస్తం పార్టీ కైవసం చేసుకుంది. రాష్ట్ర మంత్రి మన్‌ప్రీత్‌ సింగ్‌ బాదల్‌ ఈ విషయాన్ని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తూ ఫొటోలు పంచుకున్నారు.

మొహలీలో గురువారం...

రాష్ట్రంలోని మొత్తం 8 మున్సిపల్‌ కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లోని 2,302 వార్డులకు ఫిబ్రవరి 14న ఎన్నికలు జరిగాయి. బుధవారం ఉదయం 9 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టారు. మొహలీలోని రెండు పోలింగ్​ కేంద్రాల్లో మళ్లీ ఓటింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించిన నేపథ్యంలో.. ఆ కార్పొరేషన్​ పరిధిలో ఓట్ల లెక్కింపు గురువారం జరగనుంది. బుధవారం అక్కడ రీపోలింగ్​ జరిగింది.

రైతు చట్టాలను నిరసిస్తూ ఎన్​డీఏ నుంచి అకాలీదల్ వైదొలగటం వల్ల ఈసారి భాజపా, ఎస్​ఏడీ విడివిడిగా పోటీ చేశాయి.

ఇదీ చదవండి : 'కరోనాపై అతి విశ్వాసంతో కేంద్రం'

Last Updated : Feb 17, 2021, 5:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.