ETV Bharat / bharat

2 లక్షల దిగువకు కరోనా కేసులు- భారీగా పెరిగిన మరణాలు

Coronavirus Update: భారత్​లో కరోనా కొత్త కేసులు 2 లక్షల దిగువకు చేరాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు మరో 1,67,059 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో 1192 మంది మరణించారు. 2,54,076 మంది కొవిడ్​ను జయించారు. దేశంలో పాజిటివిటీ రేటు 11.69 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

COVID CASES IN INDIA
COVID CASES IN INDIA
author img

By

Published : Feb 1, 2022, 9:04 AM IST

Updated : Feb 1, 2022, 10:13 AM IST

Covid cases in India: భారత్​లో కొవిడ్​ కేసులు భారీగా తగ్గాయి. ఒక్కరోజులో.. 1,67,059 కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య మళ్లీ భారీగా పెరిగింది. 1192 మంది మరణించడం ఆందోళన కలిగిస్తోంది. కేరళ రాష్ట్రం మునుపటి గణాంకాలను సవరిస్తుండటమే ఈ మార్పునకు కారణం. 2,54,076 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 11.69 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

యాక్టివ్​ కేసులు ప్రస్తుతం 4.20 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 94.60 శాతానికి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

  • మొత్తం కేసులు: 4,14,69,499
  • మొత్తం మరణాలు: 4,96,242
  • యాక్టివ్ కేసులు: 17,43,059
  • మొత్తం కోలుకున్నవారు: 3,92,30,198

Vaccination in India

భారత్​లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. సోమవారం 61,45,767 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,66,68,48,204కు చేరింది. నిర్విరామంగా సాగుతూ, అన్ని వయస్సుల వారికి చేరువవుతోన్న టీకా కార్యక్రమం మూడో ఉద్ధృతికి ముకుతాడు వేసిందని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేశాయి.

Covid Tests:

సోమవారం.. దేశవ్యాప్తంగా 14 లక్షల 28 వేల 672 కరోనా పరీక్షలు చేశారు. మొత్తం టెస్ట్​ల సంఖ్య 73 కోట్లు దాటింది.

World Corona cases

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​ మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 20,18,209 మందికి కరోనా సోకింది. 7,617 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసులు 37,77,21,704కు చేరగా.. మరణాల సంఖ్య 56,91,213కు పెరిగింది.

  • US Corona Cases: అమెరికాలో కొవిడ్​ విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 274266 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. 1153 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 76 కోట్లు దాటింది.
  • ఫ్రాన్స్​లో ఒక్కరోజే 82 వేలకుపైగా కేసులు వెలుగుచూశాయి. మరో 348 మంది చనిపోయారు.
  • ఇటలీలో 57,715 కొత్త కేసులు బయటపడగా.. 349 మంది మరణించారు.
  • బ్రెజిల్​లో కొత్తగా 102,616 మందికి వైరస్​ సోకగా.. 442 మంది చనిపోయారు.
  • అర్జెంటీనాలో తాజాగా 43 వేలకుపైగా కరోనా కేసులు బయటపడగా.. 285 మంది బలయ్యారు.
  • జర్మనీలో ఒక్కరోజే దాదాపు లక్షా 20 వేల మందికి వైరస్ సోకింది. మరో 147 మంది మృతి చెందారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చూడండి: కేరళలో తగ్గిన కరోనా కేసులు.. భారీగా పెరిగిన మరణాలు​

'వ్యాక్సినేషన్​తో దేశ శక్తిసామర్థ్యాలు ప్రపంచవ్యాప్తం'

Last Updated : Feb 1, 2022, 10:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.