ETV Bharat / bharat

దేశంలో రికార్డు స్థాయిలో పెరిగిన కరోనా కేసులు, మరణాలు - omicron cases in india

Covid cases in India: భారత్​లో ఒక్కరోజే కరోనా కేసులు, మరణాలు భారీగా పెరిగాయి. మరో 3,47,254 మందికి వైరస్​ సోకింది. 703 మరణాలు నమోదయ్యాయి.

covid cases in india
covid cases in india
author img

By

Published : Jan 21, 2022, 9:25 AM IST

Updated : Jan 21, 2022, 10:12 AM IST

Corona cases in India: భారత్​లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. వేగంగా కేసులు పెరిగిపోతున్నాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు దేశంలో.. 3,47,254 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్​తో మరో 703 మంది మరణించారు. 2,51,777 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 17.94 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

Covid Active Cases: యాక్టివ్​ కేసుల సంఖ్య 20 లక్షల 18 వేల 825గా ఉంది. ఇది మొత్తం కేసుల్లో 5.23 శాతం. గత 235 రోజుల్లో ఇదే అత్యధికం. రికవరీ రేటు 93.50 శాతానికి పెరిగింది.

  • మొత్తం కేసులు: 3,85,66,027‬
  • మొత్తం మరణాలు: 4,88,396‬
  • యాక్టివ్ కేసులు: 20,18,825
  • మొత్తం కోలుకున్నవారు: 3,60,58,806

Omicron Cases in India:

దేశంలో ఒమిక్రాన్​ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఒక్కరోజే సుమారు 5 శాతం మేర పెరుగుదల నమోదైంది. 28 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 9,692కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Vaccination in India:

భారత్​లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. గురువారం ఒక్కరోజే 70,49,779 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,60,43,70,484కు చేరింది.

Covid Tests in India:

గురువారం రోజు దేశవ్యాప్తంగా 19,35,912 కరోనా టెస్టులు నిర్వహించగా.. మొత్తం పరీక్షల సంఖ్య 71.15 కోట్లు దాటింది.

Global Corona Cases: ప్రపంచదేశాల్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఒక్కరోజే 35 లక్షలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 9 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కొవిడ్​ కేసులు 34,29,21,778కి చేరగా.. మరణాలు 55,92,788కి పెరిగింది.

  • అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తోంది. కొత్తగా 692,320 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. 2,700 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 7 కోట్ల 5 లక్షలు దాటింది.
  • ఫ్రాన్స్​లో ఒక్కరోజే 4,25,183 కేసులు వెలుగుచూశాయి. మరో 245 మంది చనిపోయారు.
  • ఇటలీలో 1,88,797 కొత్త కేసులు బయటపడగా.. మరో 385 మంది మరణించారు.
  • బ్రెజిల్​లో కొత్తగా 1,68,060 మందికి వైరస్​ సోకగా.. 324 మంది చనిపోయారు.
  • అర్జెంటీనాలో తాజాగా 1,29,709 కరోనా కేసులు బయటపడగా.. 181 మంది బలయ్యారు.
  • జర్మనీలో 1,34,930 మందికి వైరస్ సోకింది. మరో 176 మంది మృతి చెందారు.
  • బ్రిటన్​లో మరో 1,07,364 వేల మంది వైరస్ బారిన పడ్డారు.​ 330 మంది మృతి చెందారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చూడండి: 'వ్యాక్సినేషన్​ వల్లే కరోనా థర్డ్​ వేవ్​లో తక్కువ మరణాలు'

'12-14 ఏళ్ల పిల్లలకు టీకాపై నిర్ణయం అప్పుడే..'

Last Updated : Jan 21, 2022, 10:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.