భారత్‌లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. ఒక్కరోజే 18,327 కేసులు వెలుగుచూశాయి. మరో 108 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసులు 1,11,92,088కు చేరగా.. మరణాల సంఖ్య 1,57,656 కు పెరిగింది.
కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. శుక్రవారం.. 14,234 మంది వైరస్ నుంచి బయటపడ్డారు. ఫలితంగా ఇప్పటివరకు 1,08,54,128 మంది కొవిడ్‌ను జయించారు. ప్రస్తుతం 1,80,304 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ విజయవంతంగా కొనసాగుతోంది. దీనిలో భాగంగా ఇప్పటివరకు 1,94,97,704 టీకా డోసులు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా కొవిడ్ టెస్ట్‌లు భారీగానే నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 22,06,92,677 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.
ఇదీ చూడండి: ట్రాన్స్‌జెండర్లు రక్తదానం చేయొద్దా?