ETV Bharat / bharat

'మహా'లో కరోనా పంజా- కొత్తగా 55 వేల కేసులు - కర్ణాటకలో కరోనా కేసులు

మహారాష్ట్రలో కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. ఒక్కరోజే 55 వేల మందికిపైగా వైరస్ బారిన పడగా.. మరో 297 మంది చనిపోయారు. కర్ణాటకలోనూ కొవిడ్​ ఉగ్రరూపం దాల్చుతోంది. దిల్లీ, గుజరాత్​, రాజస్థాన్​, పంజాబ్​ సహా పలు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది.

Coronavirus cases and deaths updates in Maharashtra
మహారాష్ట్రలో కరోనా కేసులు
author img

By

Published : Apr 6, 2021, 10:45 PM IST

మహారాష్ట్రలో కరోనా కేసులు మంగళవారం మళ్లీ పెరిగాయి. ఒక్కరోజే 55,469 మందికి వైరస్​ సోకింది. మరో 297 మంది మహమ్మారితో చనిపోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 31 లక్షల 13 వేలు దాటగా.. 56 వేల మందికి పైగా మరణించారు. వీటిలో ముంబయిలోనే 10,030 కేసులు వెలుగుచూశాయని.. మరో 31 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.

కర్ణాటకలో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. ఒక్కరోజే 6,150 మంది వైరస్​ బారిన పడ్డారు. మరో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 10 లక్షల 26 వేలు దాటింది.

దిల్లీలో కొవిడ్​ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. తాజాగా 5,100 మంది వైరస్ బారిన పడ్డారు. ఈ ఏడాదిలో రోజువారి కేసుల్లో ఇవే అత్యధికం. కాగా మరో 17 మంది చనిపోయారు.

  • మధ్యప్రదేశ్​లో మరో 3,722 మంది కొవిడ్ బారిన పడగా.. 18 మంది చనిపోయారు.
  • గుజరాత్​లో రోజువారి కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. తాజాగా 3,280 మందికి కరోనా సోకగా.. 17 మంది చనిపోయారు.
  • పంజాబ్​లో కరోనా మరణాలు భారీగా నమోదవుతున్నాయి. కొత్తగా 62 మంది మహమ్మారికి బలయ్యారు. రాష్ట్రంలో మరో 2,924 మందికి వైరస్​ సోకింది.
  • రాజస్థాన్​లో తాజాగా 2,236 కరోనా కేసులు బయటపడ్డాయి. మరో 13 మంది మరణించారు.
  • హరియాణాలో కొత్తగా 2,099 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలగా.. మరో 9 మంది మృతిచెందారు.

ఇదీ చూడండి: పీపీఈ కిట్​ ధరించి.. ఓటు వేసిన ఎంపీ కనిమొళి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.