ETV Bharat / bharat

'కరోనా మారమ్మ' పేరిట మందిరం.. ప్రత్యేక పూజలు!

కరోనా మారమ్మ పేరుతో ఆలయాన్ని నిర్మించింది ఓ మహిళ. కొవిడ్​ మహమ్మారి నుంచి నుంచి ప్రజలను ఆ దేవతే కాపాడుతుందని ఆమె చెబుతోంది. ఇంతకీ ఎవరామె? ఆ మందిరం ఎక్కడ ఉంది?

Corona Maramma Devi
కరోనా దేవికి ఆలయం
author img

By

Published : May 22, 2021, 1:34 PM IST

కరోనా మహమ్మారి ఎందరి జీవితాలనో అతలాకుతలం చేసింది. ఎందరి ప్రాణాలనో బలితీసుకుంది. ఈ బాధల నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ కొంతమంది ఆ మహమ్మారికే పూజలు చేస్తున్నారు. కర్ణాటక చమరాజనగర జిల్లా కొల్లేగాలా తాలుకాలోని మధువానహల్లి గ్రామంలో 'కరోనా మారమ్మ' మందిరాన్ని నిర్మించారు. అందులో ఓ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు.

Corona Maramma Devi
కరోనా మారమ్మ దేవి విగ్రహం

కలలో దేవత కనిపించగా..

ఈ కరోనా దేవి విగ్రహాన్ని మధువానహల్లికి చెందిన యశోదమ్మ అనే మహిళ ఏర్పాటు చేశారు. మూడు రోజుల క్రితం తనకు కలలో చాముండేశ్వరీ దేవి కనిపించి.. మారమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరినట్లుగా చెప్పారు. దానివల్ల ప్రపంచం నుంచి కరోనా మహమ్మారి వైదొలిగి, శాంతి నెలకొంటుందని చెప్పినట్లుగా తెలిపారు.

Corona Maramma Devi
కరోనా మారమ్మ దేవికి పూజలు
Corona Maramma Devi
కరోనా మారమ్మ ఆలయంలో యశోదమ్మ పూజలు

తనకు కరోనా మారమ్మపై నమ్మకం ఉందని యశోదమ్మ తెలిపారు. ఆ దేవినే అందరికీ మంచి చేస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. శాంతి మంత్రం పఠిస్తూ.. రోజుకు రెండు సార్లు కరోనా మారమ్మకు పూజలు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: వాట్సాప్​లో దినపత్రికలు షేర్​ చేస్తే అంతే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.