ETV Bharat / bharat

ఇద్దరు డిప్యూటీ సీఎంలు, ముగ్గురు మంత్రులకు కరోనా - అమితాబ్​ కార్యాలయంలో కరోనా

Bihar deputy cms tests covid postive: బిహార్ రాష్ట్ర మంత్రివర్గంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇద్దరు డిప్యూటీ సీఎంలు సహా ముగ్గురు మంత్రులకు కొవిడ్ సోకినట్లు తేలింది. మరోవైపు.. పంజాబ్​లో శిరోమణి అకాలీ దళ్ అధ్యక్షుడు కరోనా బారినపడ్డారు.

bihar coorna cases, bihar deputy cms corona
బిహార్​లో కరోనా కేసులు, బిహార్​ డిప్యూటీ సీఎంలకు కొవిడ్​
author img

By

Published : Jan 5, 2022, 12:23 PM IST

Bihar deputy cms tests covid postive: దేశంలో కరోనా మహమ్మారి బీభత్సం సృష్టిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో పాజిటివ్​ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. బిహార్​లో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు రేణూ దేవీ, తారా ప్రసాద్ కిశోర్​ సహా మంత్రులు సునీల్​ కుమార్​, విజయ్ చౌదరి, అశోక్ చౌదరికి కరోనా నిర్ధరణ అయింది.

"కొవిడ్ పరీక్షలో నాకు పాజిటివ్ వచ్చింది. ప్రసుత్తం పట్నాలోని నా నివాసంలో క్వారంటైన్​లో ఉన్నాను. నన్ను ఇటీవల కలిసిన వారంతా దయచేసి పరీక్షలు చేయించుకోండి" అని తారాకిశోర్ ట్వీట్ చేశారు.

Punjab coronavirus: పంజాబ్​లోనూ కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. శిరోమణి ఆకాలీ దళ్​(సంయుక్త్​)​ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ సుఖ్దేవ్​ సింగ్ ధిండ్సా కరోనా బారినపడ్డారు.

అమితాబ్​ సిబ్బందిలోనూ..

బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్​ బచ్చన్​ కార్యాలయంలోనూ ఓ సిబ్బందికి కరోనా సోకింది. ఈ విషయాన్ని బృహన్​ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) అధికారి ఒకరు తెలిపారు. అమితాబ్​కు చెందిన రెండు భవనాల్లోని మొత్తం 31 మంది సిబ్బందికి పరీక్షలు జరపగా.. ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు తేలిందని చెప్పారు. సదరు వ్యక్తి ప్రస్తుతం క్వారంటైన్​లో ఉన్నారన్నారు. బాధితునితో సన్నిహితంగా ఉన్న వారిని గుర్తిస్తున్నామని పేర్కొన్నారు.

India covid cases:

మరోవైపు.. దేశంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. మంగళవారం ఒక్కరోజే 58,097 కేసులు వెలుగుచూశాయి. మరో 534మంది ప్రాణాలు కోల్పోయారు. 15,389 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 4.18 శాతంగా ఉందని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇదీ చూడండి: భారత్​ బయోటెక్​ చుక్కల మందు టీకా పరీక్షలకు అనుమతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.