దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. తమిళనాడులో కొత్తగా 27,936 కేసులు నమోదయ్యాయి. 478 మంది ప్రాణాలు కోల్పోయారు. 31,223 మంది డిశ్చార్జ్ అయ్యారు.
దేశ రాజధానిలో కొత్తగా 648 కేసులు వెలుగులోకి వచ్చాయి. 86 మంది మరణించారు.
వివిధ రాష్ట్రాల్లో ఇలా..
మహారాష్ట్రలో 15,077 మందికి వైరస్ నిర్ధరణ అయింది. 184 మంది చనిపోయారు.
కేరళలో 12,300 కేసులు నమోదయ్యాయి. 174 మంది మృతి చెందారు.
కర్ణాటకలో 16,604 కేసులు బయటపడ్డాయి. 411 మంది మరణించారు.
బంగాల్లో 10,137 కేసులు వెలుగుచూశాయి. 131 మంది ప్రాణాలు కోల్పోయారు.
పంజాబ్లో 2,221 మందికి పాజిటివ్ వచ్చింది. 117 మంది చనిపోయారు.
వ్యాక్సినేషన్..
ఇప్పటివరకు దేశంలో 21.58 కోట్ల వాక్సిన్ డోసుల పంపిణీ జరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇదీ చూడండి: 'కేంద్రం వైఫల్యంతో 97% మంది ప్రజలకు నష్టం!'