ETV Bharat / bharat

దేశంలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా 22,270 మందికి వైరస్ - corona update india

Corona Cases In India: దేశంలో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. 22,270 మందికి కొత్తగా వైరస్​ సోకింది. 325 మంది కొవిడ్​ కారణంగా చనిపోయారు.

corona cases in india
భారత్​లో కొవిడ్ కేసులు
author img

By

Published : Feb 19, 2022, 9:40 AM IST

India covid cases: దేశంలో కరోనా కేసులు మరోసారి తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 22,270 మందికి కరోనా నిర్ధరణ అయింది. మరో 325 మంది మరణించారు. 60,298 మంది బాధితులు కోలుకున్నారు. పాజిటివిటీ రేటు 1.08 శాతానికి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

  • మొత్తం మరణాలు: 5,11,230
  • యాక్టివ్ కేసులు: 2,53,739
  • మొత్తం కోలుకున్నవారు: 4,20,37,536

Vaccination in India:

దేశంలో వ్యాక్సినేషన్ వేగంగానే కొనసాగుతోంది. శుక్రవారం మరో 36,28,578 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ అయిన మొత్తం డోసుల సంఖ్య 1,75,03,86,834కు చేరింది.

Covid Tests in India: దేశవ్యాప్తంగా శుక్రవారం 12,35,471 కరోనా పరీక్షలు చేశారు. మొత్తం టెస్టుల సంఖ్య 75,54,64,684‬కు చేరింది.

World Covid cases:
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగానే నమోదవుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 42 లక్షలకు పైగా కేసులు బయటపడ్డాయి. జర్మనీ, రష్యా, బ్రెజిల్, అమెరికా దేశాల్లో వైరస్​ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది.

  • అమెరికాలో కేసులు భారీగానే నమోదవుతున్నాయి. కొత్తగా 1,08,480 మందికి వైరస్ సోకింది. మరో 2,070 మంది వైరస్ కారణంగా మృతిచెందారు.
  • జర్మనీలో కొత్తగా 2,06,037 లక్షల కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మరో 246 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
  • రష్యాలో 1,80,071 మందికి వైరస్ నిర్ధరణ అయింది. కొత్తగా 784 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • బ్రెజిల్​లో 24 గంటల్లో 1,22,748 మంది వైరస్ బారిన పడ్డారు. తాజాగా 1,114 కొవిడ్ కారణంగా మృతిచెందారు.

ఇదీ చూడండి: '80 శాతం మంది వయోజనులకు వ్యాక్సినేషన్​ పూర్తి'​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.