భారత్‌లో కరోనా కేసులు ఆదివారంతో పోల్చితే భారీగా తగ్గాయి. కొత్తగా..37,154 మందికి వైరస్ సోకింది. వైరస్ బారిన పడి 724 మంది ప్రాణాలు విడిచారు. కొత్తగా 39,649 మంది వైరస్‌ను జయించారు. రికవరీ రేటు 97.22 శాతానికి చేరుకుంది.
- మొత్తం కేసులు:3,08,74,376
- మొత్తం మరణాలు: 4,08,764
- కోలుకున్నవారు: 3,00,14,713
- యాక్టివ్ కేసులు: 4,50,899
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ప్రపంచంలో కొవిడ్ కేసులు
ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 3,73,711 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. 6,508 మంది చనిపోయారు. కాగా 3,55,037 మంది కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య 187,620,804గా ఉంది.
- అమెరికా - 34,732,753
- బ్రెజిల్ - 19,089,940
- ఫ్రాన్స్ - 5,812,639
- రష్యా - 5,783,333
- యూకే-5,121,245
వ్యాక్సినేషన్:
దేశంలో ఇప్పటివరకు 37,73,52,501 డోసులు పంపిణీ చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. ఆదివారం ఒక్కరోజే 12,35,287 డోసులు అందించినట్లు తెలిపింది.
ఇవీ చదవండి:జికా వైరస్.. కరోనా కంటే ప్రమాదకరమా?