Corona cases in India: పలు రాష్ట్రాల్లో రోజువారీ కరోనా కేసులు దిగొస్తుండగా.. కేరళలో మాత్రం పెరుగుతున్నాయి. శనివారంతో పోల్చుకుంటే కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 51,570 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 60 లక్షలకు చేరువైంది. మరో 12 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మరణాల సంఖ్య 53,666కు చేరింది. 32,701 మంది మహమ్మారిని జయించారు.
కన్నడ నాట తగ్గిన కేసులు
కర్ణాటకలో కరోనా కొత్త కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా 28,264 కేసులు వెలుగుచూశాయి. మరో 68 మంది మృతి చెందారు. కాగా 29,244 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
తమిళనాడులోనూ కొవిడ్ కేసులు తగ్గాయి. కొత్తగా 22,238 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. మరో 38 మంది మరణించారు. 26 వేల మందికిపైగా కోలుకున్నారు.
జమ్ముకశ్మీర్‌లో కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. తాజాగా 4,615 మంది వైరస్ బారినపడ్డారు. మరో ఏడుగురు మృతి చెందారు.
రాష్ట్రం | కొత్త కేసులు | మరణాలు |
కేరళ | 51,570 | 12 |
కర్ణాటక | 28,264 | 68 |
తమిళనాడు | 22,238 | 38 |
ఆంధ్రప్రదేశ్ | 10,310 | 12 |
రాజస్థాన్ | 10,061 | 21 |
గుజరాత్ | 9,395 | 30 |
ఒడిశా | 4,843 | 19 |
జమ్ముకశ్మీర్ | 4,615 | 07 |
దిల్లీ | 3,674 | 30 |
తెలంగాణ | 2,484 | 01 |
ఛత్తీస్గడ్ | 2,373 | 10 |
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: ఇంట్లోనే కెమికల్ ఫ్యాక్టరీ.. ముగ్గురు చిన్నారులు సజీవ దహనం